Ranveer Singh | బాలీవుడ్ స్టార్ నటుడు రణవీర్ సింగ్ అతి పెద్ద మల్టీ స్టారర్ మూవీని ప్రకటించాడు. రణవీర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి ఆదిత్య ధర్ దర్శకత్వం వహించబోతున్నట్లు సమాచారం. ఇక ఈ ప్రాజెక్ట్‌లో సంజయ్ దత్, మాధవన్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా కీలక పాత్రల్లో పోషించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను సంబంధించి రణవీర్ ప్రత్యేక పోస్ట్ పెట్టాడు.
నాతో చాలా ఓపికగా ఉండి, ఇలాంటి మలుపు కోసం ఎదురుచూస్తున్న నా అభిమానుల కోసం ఈ సినిమా చేస్తున్న. నేను మీ అందరినీ ప్రేమిస్తున్నాను. అలాగే ఈసారి మునుపెన్నడూ లేని విధంగా సినిమాటిక్ అనుభూతిని అందిస్తానని మాటిస్తున్నాను. మీ ఆశీర్వాదాలతో ఈ సాహసయాత్రను ప్రారంభించాము. ఈసారి పక్కా పర్సనల్ అంటూ రాసుకోచ్చాడు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. స్పై బ్యాక్‌డ్రాప్‌లో రానున్నట్లు తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ త్వరలోనే వెల్లడించనున్నారు.
This one is for my fans, who have been so patient with me, and been clamouring for a turn like this. I love you all, and I promise you, this time, a cinematic experience like never before.
With your blessings, we embark on this great, big motion picture adventure with spirited… pic.twitter.com/77piFkQsdY
— Ranveer Singh (@RanveerOfficial) July 27, 2024
Also read..