Bollywood | సినీ సెలబ్రిటీల లగ్జరీ లైఫ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారు తిరిగే కార్లు, ఉండే ఇల్లు అంత లగ్జరియస్‌గా ఉంటుంది. ఉదాహరణకి షారూఖ్ ఖాన్ ఇల్లు, అమితాబ్ బచ్చన్ ఇల్లు చూస్తే అదొక ఇంద్ర భవనం మాదిరిగా ఉంటుంది. వంద కోట్ల ఖర్చుతో ఇల్లు నిర్మించుకున్న వారు ముంబైలో చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్వీర్ సింగ్, దీపికా పదుకునే తమ డ్రీమ్ హౌస్‌ను రూ.100 కోట్లకు పైగా ఖర్చు చేసి నిర్మించుకుంటున్నట్టు బీటౌన్‌లో టాక్ నడుస్తుంది. ముంబైలోని అత్యంత ఖరీదైన ఏరియాలో, సముద్రానికి ఎదురుగా ఉండే విధంగా వీరు తమ ఇంటిని నిర్మించుకున్నట్టు టాక్ నడుస్తుంది.
విలాసవంతమైన అపార్ట్మెంట్లో 16 నుంచి 19వ అంతస్తు వరకు వీరి ప్లాట్ విస్తరించి ఉంటుంది. ఈ క్వాడ్రాప్లెక్స్ ఇల్లు ఖరీదు దాదాపుగా రూ.100 కోట్లు ఉంటుందని ఇండస్ట్రీలో ఓ టాక్ నడుస్తుంది. బాలీవుడ్లో ఈ స్థాయిలో ఖర్చు చేసి ఇల్లు కొనుగోలు చేయడం చాలా అరుదు. ఇప్పుడు రణ్వీర్ సింగ్ జంట కూడా ఆ లిస్ట్‌లో చేరడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇదే అపార్ట్మెంట్లో ఇండస్ట్రీకి చెందిన చాలా మంది సెలబ్రిటీలు ఉంటున్నారు. మన్నత్ కి రిపేర్స్ చేయిస్తున్న షారుఖ్ ఖాన్ ఫ్యామిలీ ప్రస్తుతం ఇదే అపార్ట్మెంట్లో ఉంటున్నట్టు సమాచారం. సల్మాన్ ఖాన్‌కి సైతం ఈ అపార్ట్మెంట్లో ప్లాట్ ఉంది. ఈ అపార్ట్మెంట్లో ప్లాట్ ఉందంటే కచ్చితంగా వారు ముంబైలోనే బిగ్ షాట్స్ అనే చెప్పుకోవాలి.
ప్రస్తుతం రణ్వీర్ సింగ్, దీపికా పదుకునే నివాసం ఉంటున్న ఇల్లును 2021లో దాదాపు పాతిక కోట్లు ఖర్చు చేసి కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఈ దంపతులకి ఒక పాప కూడా ఉంది. ఈ క్రమంలోనే వీరు విలాసవంతమైన ఇల్లు కొనుఓలు చేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది. ప్రస్తుతం రణ్వీర్ సింగ్, దీపికా పదుకునే నివాసం ఉంటున్న ఇల్లును 2021లో దాదాపు పాతిక కోట్లు ఖర్చు చేసి కొనుగోలు చేయగా,ఇప్పుడు వారికి ఒక పాప కూడా ఉండడంతో ఖరీదైన ఇల్లును వీరు కొనుగోలు చేసేందుకు సిద్ధం అయ్యారు.దీపికా, రణ్‌వీర్‌లు ఇప్పుడు టాలీవుడ్లో టాప్ స్టార్స్. వారు పారితోషికం బాగానే అందిపుచ్చుకుంటారు. ఈ క్రమంలోనే వారు ఖరీదైన ఇల్లు కొనుగోలు చేయాలన అనుకుంటున్నట్టు తెలుస్తుంది.