RANU BOMBAI KI RANU | ఈ మధ్య ఫోక్ సాంగ్స్‌కి మంచి ఆదరణ లభిస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం.. సినిమాలలో కూడా ఛాన్స్ ఉంటే తప్పక ఏదో ఒక ఫోక్ సాంగ్ పెడుతున్నారు. కొన్ని ప్రైవేట్ ఫోక్ సాంగ్స్ కూడా మంచి ఆదరణ దక్కించుకుంటున్నాయి. అలాంటి వాటిలో అద్దాల మేడలున్నాయే..మేడల్లా మంచి చీరలున్నాయే.. సాంగ్ ఒకటి. ఈ మధ్య ఏ వేడుకలు జరిగిన ఈ సాంగ్ తప్పక వినిపిస్తూ ఉంది. గత రెండు మూడు నెలల నుండి ఈ సాంగ్ ఓ ఊపు ఊపుతుంది. పలువురు ఈ పాటకి డ్యాన్స్ లు చేయడం, ఇంకొందరు రీల్స్ చేయడం వంటివి చేస్తున్నారు.
సంగీత ప్రియులు ఈ పాటని రిపీటెడ్ గా వింటున్న నేపథ్యంలో యూట్యూబ్‌లో ఈ పాట మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతుంది. విజువల్స్ కూడా చాలా గ్రాండియర్‌గా ఉన్నాయి. మ్యూజిక్, కొరియోగ్రఫీ అంతా కుదిరింది. రాము రాథోడ్, లిఖిత ఈ పాటకి తమదైన స్టైల్లో స్టెప్పులు వేసి అలరించారు. మరోవైపు రాము ఈ పాటని రచించడమే కాకుండా సింగర్ ప్రభతో కలిసి ఆలపించారు. శేఖర్ కొరియోగ్రఫీ చేయగా, వాలి నిర్మించారు. కళ్యాణ్ కీస్ సంగీతం అందించారు. ఇప్పటి వరకు ఈ పాటకి 124 మిలియన్లకి పైగా వ్యూస్ దక్కాయి.
ఇంత పాపులరైన ఈ పాటను ఎంత ఖర్చు పెట్టి తీశారు? ఆ తర్వాత.. అది హిట్టయ్యి ఎంత లాభాలు తెచ్చిందో తెలుసుకోవాలని చాలా మంది అనుకుంటారు. అయితే ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సింగర్ రామ్ రాథోడ్.. ఈ పాటకు మొత్తం 5 లక్షలు ఖర్చు పెట్టినట్లు తెలిపారు. కేవలం షూటింగ్ కోసం 3.5 లక్షల వరకు ఖర్చు కాగా.. మ్యూజిక్, ఇతర వాటి కోసం మరో 2 లక్షలు ఖర్చు అయిందని తెలిపారు. కాగా, సాంగ్ విడుదలై మంచి రెస్సాన్స్ వచ్చిన తర్వాత యూట్యూబ్ నుంచి దాదాపు 20 లక్షలు వరకు వచ్చినట్లు తెలిపారు. 2025 జనవరిలో విడుదలైన ఈ సాంగ్.. ఇప్పటి వరకు యూట్యూబ్ లో 124 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకోగా, రానున్న రోజులలో మరింత పెరిగే అవకాశం ఉంది. వ్యూస్‌తో పాటు వారికి వచ్చే డబ్బు కూడా పెరుగుతుంది. ఈ పాటని రచించిన రాము రాథోడ్ గతంలో సొమ్మసిల్లి పోతున్నవే ఓ చిన్న రాములమ్మ అనే సాంగ్‌ని కూడా రచించి ఆలపించారు. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది.