Vaarasudu Movie | రంజితమే వీడియో సాంగ్ వచ్చేసింది..!
ఎన్నో వివాదాల నడుమ సంక్రాంతి కానుకగా రిలీజైన 'వారసుడు' తమిళంలో లాక్కొచ్చినా.. తెలుగులో బ్రేక్ ఈవెన్ సాధించకుండానే దుకాణం సర్దేసింది. సినిమా రిజల్ట్ సంగతి పక్కన పెడితే ఈ మూవీలోని పాటలను మాత్రం ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేశారు.
Ranjithame Video Song | ఎన్నో వివాదాల నడుమ సంక్రాంతి కానుకగా రిలీజైన ‘వారసుడు’ తమిళంలో లాక్కొచ్చినా.. తెలుగులో బ్రేక్ ఈవెన్ సాధించకుండానే దుకాణం సర్దేసింది. పైగా పోటీగా నాన్-వెజ్ లాంటి ‘వీరసింహారెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలుండటంతో తెలుగు ప్రేక్షకులు వారసుడు సినిమాను అంతగా పట్టించుకోలేదు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్నా, తెలుగు ప్రేక్షకులను మాత్రం నిరాశపరిచింది. అయితే విజయ్‌కు తెలుగులో ఉన్న మార్కెట్ పరంగా చూసుకుంటే ఈ సినిమా రెండు,మూడు కోట్లు ఎక్కువే సాధించింది.
సినిమా రిజల్ట్ సంగతి పక్కన పెడితే ఈ మూవీలోని పాటలను మాత్రం ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా ‘రంజితమే’ సాంగ్‌కు ఈలలు, గోలలతో థియేటర్లు దద్దరిల్లిపోయాయి. థమన్ స్వర పరిచిన ఈ పాటకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. కాగా తాజాగా ఈ పాట వీడియో సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. విజయ్, రష్మిక ఊరమాస్ స్టెప్పులు మనల్ని కూడా కాళ్లు కదిపేలా చేస్తున్నాయి. తమిళంలో ఎమ్.ఎమ్.మానసితో కలిసి స్వయంగా విజయ్ ఆలపించిన ఈ పాటను తెలుగులో అనురాగ్ కులకర్ణి ఆలపించాడు.
ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో రష్మిక హీరోయిన్గా నటించింది. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించాడు. నిజానికి ఈ సినిమా జనవరి 11నే తెలుగులో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ పలు కారణాల వల్ల మూడు రోజులు వెనక్కి జరిగింది. అయితే ముందచ్చుంటే మాత్రం ఈ సినిమా రిజల్ట్ వేరేలా ఉండేది. ఇప్పటి వరకు టోటల్‌గా ఈ మూవీ రూ.200 కోట్లకు పైగా గ్రాస్‌ను కలెక్ట్ చేసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | ఓటీటీలోకి మెగాస్టార్ చిరంజీవి.. నెట్‌ఫ్లిక్స్‌లో ‘మెగావర్స్’ టాక్ షో,15 ఎపిసోడ్స్‌తో భారీ ప్లాన్!
Imam Salary | మౌజన్.. ఇమామ్‌ల వేతనగోస.. ఏడు నెలలుగా 16,379 మంది ఎదురుచూపులు
Bigg Boss 10 | బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్‌కు త్రిగుణ్ వార్నింగ్.. షాలిని గురించి చెబుతూ ఎమోషనల్!
KRMB Meeting | కేఆర్ఎంబీ సమావేశం మళ్లీ వాయిదా.. ఇరు రాష్ర్టాలకు బోర్డు లేఖ
JEE Main | విద్యార్థులకు ఎన్టీఏ గుడ్‌న్యూస్.. ఇకపై ఒకే లాగిన్‌తో జేఈఈ రిజిస్ట్రేషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

