‘కళ్లు మూసి కళ్లు తెరిచే లోపు 30ఏళ్ల కెరీర్ పూర్తయింది. నటనే నా గమ్యం అని నేనెప్పుడూ ఫీలవ్వలేదు. అందుకే.. టైమ్ తెలియలేదు.’ అంటూ స్పందించారు సీనియర్ నటి రాణీ ముఖర్జీ. 30ఏండ్ల కెరీర్ పూర్తి చేసుకున్న సందర్భంగా యష్ రాజ్ ఫిల్మ్స్ అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్లో రాణీ ముఖర్జీ ఈ పర్సనల్ నోట్‌ను షేర్ చేశారు.
‘రాజా కీ ఆయేగీ బారాత్’ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన తానకు సినిమా అంటే కేవలం గ్లామర్ కాదని, అదొక బాధ్యతని తొలి సినిమాకే అవగతం అయ్యిందని, కెరీర్ ప్రారంభంలోనే ఆత్మగౌరవం కోసం పోరాడే పాత్రలు చేశాననీ, అవి తాను చేయబోయే పాత్రలకు బలమైన పునాదులయ్యాయని, తాను నటించిన హచ్కీ, శ్రీమతి ఛటర్జీ వర్సెస్ నార్వే లాంటి చిత్రాలు తన మానసిక బలహీనతలపై అవగాహనను పెంచాయని రాణీ ముఖర్జీ అభిప్రాయపడ్డారు. తన ప్రయాణాన్ని గొప్పగా తీర్చిదిద్దిన బాలీవుడ్ ఆడియన్స్‌కు రాణీ ముఖర్జీ కృతజ్ఞతలు తెలిపారు.