Ante Sundaraniki | విభిన్న తరహా కథలను ఎంచుకుంటూ తన సహజ నటనతో ప్రేక్షకులను ఎప్పటికప్పుడు మెస్మరైజ్ చేస్తుంటాడు నాచ్యురల్ స్టార్ నాని. రొటీన్ భిన్నంగా కథలను ఎంచుకుంటూ మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఈయన నటించిన లేటెస్ట్ చిత్రం ‘అంటే సుందరానికీ’. ‘బ్రోచేవారెవరురా’ ఫేం వివేక్ ఆత్రేయా దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై మొదటి నుంచి ప్రేక్షకులలో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే విడుదలైన ట్రైలర్ అంచనాలను రెట్టింపు చేసింది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్రబృందం తరచూ ఒక అప్డేట్తో ప్రేక్షకులను అలరిస్తుంది. తాజాగా మరో అప్డేట్ను మేకర్స్ ప్రకటించారు.
ఈ చిత్రంలోని రంగో రంగ అంటూ సాగే పాటను సోమవారం విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో నాని చేతిలో సైకిల్‌ను మోస్తూ ఆశ్చర్యంతో చూస్తున్నాడు. ఇదివరకే చిత్రం నుంచి విడుదలైన ‘ది పంచకట్టు’ ‘ఎంత చిత్రం’ పాటలకు శ్రోతల నుంచి విశేష స్పందన వచ్చింది. ఈ చిత్రంలో నానికి జోడీగా నజ్రియా హీరోయిన్గా నటించింది. నజ్రియా తెలుగులో నటించిన మొదటి చిత్రం ఇదే కావడం విశేషం. ఈ చిత్రంలో నాని బ్రహ్మణుడి పాత్రలో నటించగా, నజ్రియా క్రిస్టియన్ అమ్మాయిగా నటించింది. మైత్రీ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించాడు.
Kickstarting with a quirk 😉#AnteSundaraniki #RangoRanga pic.twitter.com/bgYY7xq3h7
— Nani (@NameisNani) May 21, 2022