Rangasthalam | రామ్ చరణ్ కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాలలో రంగస్థలం చిత్రం ఒకటి. ఈ సినిమాలో రామ్ చరణ్ నట విశ్వరూపం చూపించాడు. ఈ సినిమాకి ముందు వరకు రామ్ చరణ్ నటనపై అనేక విమర్శలు వచ్చాయి. రంగస్థలంతో అందరి నోళ్లు మూయించాడు. 1980వ దశకంలో ఒక ఊరిలో జరిగే కథను ఆధారంగా తీసుకొని సుకుమార్ రూపొందించిన ఈ చిత్రంలో రామ్ చరణ్ చెవిటి వాడిగా చిట్టిబాబు పాత్ర పోషించి అదరగొట్టాడు. ఇక రామలక్ష్మీ పాత్రలో సమంత ఒదిగిపోయింది. చరణ్ అన్నగా కుమార్ బాబు పాత్రలో ఆది పినిశెట్టి, ఊరి పెద్దలైన ఫణీంద్ర భూపతి పాత్రలో జగపతి బాబు నటించి మెప్పించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకి ప్రాణం పోసింది.
అయితే ఈ సినిమాలో హీరోయిన్గా సమంత కన్నా ముందు అనుపమ పరమేశ్వరన్ అనుకున్నారట. ఆడిషన్‌కి కూడా పిలిపించారట. కాని ఆమె డైలాగులు చెప్పకుండా తన తల్లి వైపు చూస్తుండిపోయిందట. అంతేకాదు సినిమాలో బర్రెలు కడగాలి, వాటిని తోమాలి అని చెప్పడంతో ఆ సీన్ చేయనని అనుపమ తెగేసి చెప్పిందట. దీంతో సమంత ఈ సినిమాలోకి వచ్చింది. ఇక నాగ చైతన్యని పెళ్లి చేసుకున్న తర్వాత.. సామ్ ఈ సినిమాలో నటించింది. అసలు రామలక్ష్మీగా సమంతను తప్ప వేరొకరిని కలలో కూడా ఊహించుకోలేము అన్న రేంజ్లో చిత్రంలో అదరగొట్టింది.
ఇంత మంచి ఆఫర్‌ను వదలుకోవడంతో అనుపమ పరమేశ్వరన్ ఇప్పటికీ బాధపడుతుందట. ఈ సినిమా కనుక చేసి ఉంటే అనుపమ పరమేశ్వరన్ రేంజ్ మరోలో ఉండి ఉండేది. ఇక 2018లో రిలీజైప రంగస్థలం సినిమా కొల్లగొట్టిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్టుగా రికార్డుల మోత మోగించింది ఈ చిత్రం. ఇందులో రామ్ చరణ్ నటనకు యాంటీ ఫ్యాన్స్ సైతం..ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు రామ్ చరణ్ చేస్తున్న పెద్ది సినిమా కూడా రంగస్థలం మాదిరిగానే ఉంటుందేమోనని పెద్ది ఫస్ట్ లుక్ రిలీజ్ తర్వాత ముచ్చటించుకుంటున్నారు.