ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు మెగాహీరో పంజా వైష్ణవ్ తేజ్ (Panja Vaisshnav Tej). ఈ సినిమా బాక్సాపీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించి వైష్ణవ్ మంచి క్రేజ్ సంపాదించి పెట్టింది. ఆ తర్వాత క్రిష్ డైరెక్షన్లో నటించిన కొండపొలం బాక్సాపీస్ వద్ద మిశ్రమ స్పందన రాబట్టుకుంది. ఈ రెండు చిత్రాల తర్వాత వైష్ణవ్‌తేజ్ మరో సినిమాను లైన్లో పెట్టాడు. ఈ సినిమా టైటిల్ రంగ రంగ వైభవంగ (Ranga Ranga Vaibhavanga).
ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్ డేట్ బయటకు వచ్చింది. టాకీ పోర్షన్ షూటింగ్ పూర్తయింది. కేవలం ఒక్క పాట చిత్రీకరించాల్సి ఉంది. తాజా న్యూస్ ప్రకారం మేకర్స్ ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులను షురూ చేశారట. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించబోతున్నారని టాక్. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్‌కు మంచి స్పందన వచ్చింది.
తమిళ్ అర్జున్ రెడ్డి ఫేం గిరీసావ్య (Gireesaaya)ఈ చిత్రానికిదర్శకత్వం వహిస్తున్నాడు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రాన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.రొమాంటిక్ ఫేం కేతిక శర్మ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. బాపినీడు సమర్పిస్తున్న ఈ చిత్రానికి శాందత్ కెమెరామెన్ కాగా..దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్.