Ranbir Kapoor | యానిమల్ సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన నటుడు రణ్‌బీర్ కపూర్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లను లైన్లో పెడుతున్నాడు. ఇప్పటికే సంజయ్ లీలా భన్సాలీతో లవ్ & వార్ సినిమా చేస్తున్న రణ్‌బీర్ కపూర్ తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్ బ్రహ్మాస్త్ర 2 గురించి అప్డేట్ పంచుకున్నాడు. రణ్‌బీర్ భార్య బాలీవుడ్ నటి ఆలియా భట్ మార్చి 15న పుట్టినరోజు జరుపుకుంటుడగా.. మూడు రోజుల ముందునుంచే ప్రీ బర్త్‌డే సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశాడు రణ్‌బీర్. ఇందులో భాగంగానే మీడియా సమక్షంలో ఆలియా చేత కేక్ కట్ చేయించాడు. అనంతరం జర్నలిస్ట్‌లతో ఫొటోలు దిగాడు. ఈ వేడుక అనంతరం రణ్‌బీర్ మీడియాతో మాట్లాడుతూ.. బ్రహ్మాస్త్ర 2 అప్డేట్తో పాటు లవ్ & వార్ సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.
‘బ్రహ్మాస్త్ర 2’ అనేది అయాన్ ముఖర్జీ కలల ప్రాజెక్ట్. ప్రస్తుతం ఆయన వార్ 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. అది అయిపోయిన అనంతరం బ్రహ్మాస్త్ర 2 ప్రీ-ప్రొడక్షన్ ప్రారంభిస్తాడు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. అయాన్ అనుకున్న కథలో మనం ఇప్పటివరకు కొంతనే చూశాం. పార్ట్ 2లోనే అసలు కథ ఉండబోతుంది. ఈ సీక్వెల్ గురించి త్వరలోనే అప్డేట్స్ ఉంటాయంటూ రణ్‌బీర్ చెప్పుకోచ్చాడు. అనంతరం లవ్ & వార్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్‌లో చేయాలని ప్రతి నటుడు కలలు కంటాడు. ఆలియా, విక్కీ వంటి అద్భుతమైన నటులతో పాటు మాస్టార్ లాంటి దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీతో పని చేయడం సంతోషంగా ఉంది. సంజయ్‌తో 17 ఏండ్ల క్రితం సావారియా అనే సినిమాలో నటించాను. ఇప్పుడు మళ్లీ కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది. ఆయనతో సినిమా అంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. కానీ ఒక నటుడిగా అతడితో సినిమా చేసిన అనంతరం చాలా తృప్తినిస్తుందంటూ రణ్‌బీర్ చెప్పుకోచ్చాడు.
THEM. ♥️#RanbirKapoor celebrates #AliaBhatt’s birthday with the media.#FilmfareLens pic.twitter.com/wb0q9M6NN9
— Filmfare (@filmfare) March 13, 2025