సినిమా హీరోలు లేడి గెటప్స్‌లో కనిపించడం కొత్తేమి కాదు. గతంలో కమల్ హాసన్, విక్రమ్, రాజేంద్ర ప్రసాద్ ఇలా కొందరు హీరోలు లేడి గెటప్‌లో కనిపించి సందడి చేశారు. సంజు(Sanju) చిత్రంలో రాక్ స్టార్ రణబీర్ కపూర్ సైతం లేడీ గెటప్ లో మెప్పించారు. ఇప్పుడు ఆయన మరోసారి ఆడవేషంలో అలరించేందుకు సిద్ధమవుతున్నాడు.
కమర్షియల్ యాడ్ కోసం రణ్‌బీర్ కపూర్(Ranbir kapoor) లేడి గెటప్ వేసుకున్నాడు. ఆయనను మేకప్ ఆర్టిస్ట్‌లు అమ్మాయిగా మార్చేందుకు చాలా కృషి చేశారు. ప్రోస్తటిక్ ఆర్టిస్ట్ ప్రీత్ షీల్ సింగ్ డిసౌజా ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసారు. పని చేయడంతోనే పూర్తి రోజు గడిచిపోయిందని ప్రతీషీల్ తెలిపారు. రణ్‌బీర్ కపూర్ ఈ యాడ్ కోసం లేడీ గెటప్‌లోకి మారడం గొప్ప విషయం అని అంటున్నారు.
ప్రస్తుతం రణబీర్ బ్రహ్మస్త్ర
లో నటిస్తున్నారు. అలాగే ఎల్ .యు. వి రంజన్ దర్శకత్వంలో మరో చిత్రంలో నటిస్తున్నారు. త్వరలో తన ప్రేయసి అలియా భట్ని వివాహం చేసుకునేందుకు సిద్దమవుతున్నాడు.ఈ లోపు తను ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ అన్నీ పూర్తి చేసే పనిలో ఉన్నాడు.