Ranbir Kapoor | సోషల్ మీడియాలో సెలబ్రిటీల ఫేక్ ఖాతాలు కొత్తేమీ కాదు. అభిమానులు తమ ఫేవరెట్ స్టార్ల పేరుతో, ఫోటోలు–వీడియోలు పోస్ట్ చేస్తూ వేలల్లో అనుచరులను సంపాదించేస్తుంటారు. అయితే ఇలాంటి ఫేక్ ఖాతాలు ఎలా నడుస్తాయో, అందులో ప్రజలు ఎలా ప్రవర్తిస్తారో తెలుసుకోవాలనుకున్న బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ స్వయంగా ఒక ప్రయోగం చేశాడు.రణబీర్ వెల్లడించిన ప్రకారం, అతడు ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఒరిజినల్ ఐడెంటిటీతో ఎంట్రీ ఇస్తే ఉండే హడావిడి ఎక్కువగా ఉంటుందని భావించి , తన ఐడెంటిటీని పూర్తిగా దాచి, ఒక ఫేక్ అకౌంట్ సృష్టించుకున్నాడు. ఆ ఖాతా ద్వారా ప్రజలు ఎలా స్పందిస్తారు, అనుచరులు ఎలా వ్యవహరిస్తారు, సోషల్ ప్లాట్‌ఫార్మ్‌లో వాతావరణం ఎలా ఉంటుందో పరిశీలించానని వెల్లడించాడు.
తాను నిర్వహిస్తున్న నకిలీ ఖాతాను రణబీర్ ఫన్స్టా అని పిలుస్తాడు. ఈ అకౌంట్‌ను అతడు కంటెంట్ బ్రౌజ్ చేయడానికి, తనకు స్ఫూర్తినిచ్చే అద్భుతమైన వ్యక్తులను అనుసరించడానికి ఉపయోగిస్తాడని చెప్పాడు.“బయట మనల్ని ప్రేరేపించగల వ్యక్తులు చాలా మంది ఉన్నారు. వారిని ఫాలో అవాలనుకుంటాను. కానీ నేను నటుడిని కాబట్టి అధికారికంగా ఇన్‌స్టాలో ఉండాలని అనుకోలేదు. అలా చేస్తే నా నిజమైన ఐడెంటిటీని, వ్యక్తిగత జీవితాన్ని ప్రజలకు ఇవ్వాల్సిన బాధ్యత వస్తుంది. నటన-సినిమాలే నా అసలైన ఐడెంటిటీ… అదొక్కటే నాకు చాలు అని రణబీర్ స్పష్టం చేశాడు. రణబీర్ చెబుతూ ఉండగా, పక్కనే ఉన్న ఆలియా భట్ మాత్రం సరదాగా, అయితే ఆ ఫేక్ ఖాతాను నేను కూడా ఫాలో కావడానికి అనుమతిలేదా? అని నవ్వుతూ అడిగింది.
దీనితో అక్కడ ఉన్నవాళ్లంతా నవ్వుల్లో మునిగిపోయారు. ఆలియా ఆ ఫేక్ ఖాతాను ఫాలో అయితే, వెంటనే అది ఎవరిదో బయటపడే అవకాశం ఉందని, రణబీర్ ఫాలో చేస్తున్నవారిపై కూడా ఆసక్తి పెరిగేలా చేస్తుందని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం రణబీర్–ఆలియా బిజీ షెడ్యూల్స్‌తో బిజీగా ఉన్నారు. ఆలియా భట్ ప్రస్తుతం ‘ఆల్ఫా’ చిత్రీకరణలో బిజీగా ఉంది. రణబీర్ కపూర్ ‘రామాయణం పార్ట్ 1’ షూట్లో పాల్గొంటున్నారు. అలాగే ‘యానిమల్ 2’ కూడా ఆయన చేయాల్సి ఉంది.