Animal | బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్‌కపూర్ (Ranbir Kapoor) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం యానిమల్ (Animal). అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ ఫేం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) డైరెక్ట్ చేస్తున్నాడు. కన్నడ భామ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఈ మూవీ హిందీతోపాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో యానిమల్ టీం ప్రమోషనల్ యాక్టివిటీస్‌తో ఫుల్ బిజీగా ఉంది. తాజాగా యానిమల్ ట్రైలర్ అప్డేట్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. యానిమల్ ట్రైలర్‌ను దుబాయ్‌లోని ప్రపంచ ప్రఖ్యాత చారిత్రక కట్టడం బుర్జ్‌ఖలీఫాపై రేపు స్క్రీనింగ్ చేయనున్నారు. ఈ అప్డేట్తో ఫుల్ ఖుషీ అవుతున్నారు మూవీ లవర్స్. ఈ మూవీ నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన థర్డ్ సింగిల్ నాన్న నువ్ నా ప్రాణం (NannaNuvNaaPranam) లిరికల్ సాంగ్ తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో ఎమోషనల్‌గా సాగుతూ.. మూవీ లవర్స్ ను ఇంప్రెస్ చేస్తోంది.
ఈ చిత్రానికి హర్షవర్దన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ తండ్రీకొడుకుల ప్రయాణం నేపథ్యంలో సాగే కథతో ఉండబోతున్నట్టు బీటౌన్ సర్కిల్ సమాచారం. ఇప్పటికే లాంఛ్ చేసిన యానిమల్ పోస్టర్లు నెట్టింట వైరల్ అవుతూ.. సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. ఈ మూవీలో బాబీ డియోల్, అనిల్ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పవర్ ఫుల్ గ్యాంగ్‌స్టర్ డ్రామా, బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్‌తో సూపర్ థ్రిల్ అందించేలా యానిమల్ ఉండబోతుందని ఇప్పటివరకు విడుదల చేసిన రషెస్ చెబుతున్నాయి. యానిమల్ చిత్రాన్ని భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, కృషన్ కుమార్, మురద్ ఖేతని నిర్మిస్తున్నారు.
దుబాయ్‌లో యానిమల్ ప్రమోషన్స్..
Confirmed: #AnimalTheFilm trailer will be showcased at #BurjKhalifa, Dubai tomorrow! #AnimalTrailer
Kal hoga bawaal 😈🪓#RanbirKapoor #BobbyDeol #AnilKapoor #SandeepReddyVanga #RashmikaMandanna #Animal pic.twitter.com/iqQesk0M8y
— Bollywood Talkies (@bolly_talkies) November 16, 2023
నాన్న నువ్ నా ప్రాణం లిరికల్ సాంగ్..
Satranga సాంగ్..
తెలుగు వెర్షన్ సాంగ్..