Animal | బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor), రష్మిక మందన్నా జోడీగా సందీప్‌రెడ్డి వంగా ‘యానిమల్’ (Animal)ని తెరకెక్కిస్తున్నారు. ఈ క్రైమ్ థ్రిల్లర్‌ని భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, మురాద్ ఖేతానీ, ప్రణయ్‌రెడ్డి వంగా, సందీప్ రెడ్డి వంగా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్ కథపై ఆసక్తిని పెంచితే రెండు పాటల్లో రణ్‌బీర్, రష్మిక కెమిస్ట్రీ ఆకట్టుకుంది.
కాగా ఈ చిత్రం రన్ టైమ్ కాస్త ఆశ్చర్యపరుస్తోంది. ఈ చిత్రం నిడివి 3.30గంటలని సమాచారం. ఈ మధ్య కాలంలో ఇంత ఎక్కువ నిడివి వున్న చిత్రాలు రాలేదనే చెప్పాలి. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సంబధించిన మరో ఆసక్తికరమైన విషయం తెలుస్తోంది. యానిమల్ కి పార్ట్ 2 కూడా వుందని సమాచారం. యానిమల్ క్లైమాక్స్ లో పార్ట్ 2 (Animal 2)లీడ్ ఇస్తారని సమాచారం. యానిమల్ తర్వాత సందీప్, ప్రభాస్ తో స్పిరిట్ సినిమా చేయాలి.
ఈ సినిమా తర్వాత యానిమల్ సీక్వెల్ సెట్స్ పైకి వెళ్ళే ఛాన్స్ వుంది. అయితే సీక్వెల్ పై అధికారిక ప్రకటన రావాల్సివుంది. డిసెంబర్ 1 యానిమల్ ప్రేక్షకుల ముందుకు రానుంది.
యానిమల్ టీజర్..
Satranga సాంగ్..
తెలుగు వెర్షన్ సాంగ్..
Satranga is yours noww🤍https://t.co/DEvMZcMcTm#Animal2ndSong #AnimalOn1stDec #AnimalTheFilm @AnimalTheFilm @AnilKapoor #RanbirKapoor @thedeol @tripti_dimri23 @arijitsingh @singer_karthik @shreyaspuranik@KuttiKalam @IananthaSriram@EricnPillai #DurgeshRRajbhatt… pic.twitter.com/guheXsKtrE
— Rashmika Mandanna (@iamRashmika) October 27, 2023