Hero | తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఆస్తులు కూడబెట్టడం, వారిని భవిష్యత్తులో స్థిరంగా నిలబెట్టాలని ప్రయత్నించడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే కొందరు పిల్లలు పెద్దయ్యాక వారికి ఆస్తులు రాసిచ్చినా, కొన్ని కుటుంబాల్లో మాత్రం ముందుగానే వారసత్వంగా రిజిస్టర్ చేస్తారు. తాజాగా బాలీవుడ్ స్టార్ దంపతులు రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ తమ కుమార్తె రాహా కపూర్ విషయంలో చేసిన పని అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 2022 నవంబర్‌లో జన్మించిన రాహా కపూర్ వయసు ఇంకా రెండు సంవత్సరాలే. అయితే ఇప్పటికే ఆమె పేరు మీద భారీ ఆస్తి రిజిస్టర్ చేయబడిందన్న వార్త బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.
ముంబై నగరంలోని ఖరీదైన ప్రాంతమైన బాంద్రాలో వీరికి ఒక ఇల్లు ఉంది. ఆ ఇంటి విలువ ఏకంగా 250 కోట్లు ఉంటుందట.. ఈ ఆస్తి మొదటగా రాజ్ కపూర్ నుంచి రిషి కపూర్, తర్వాత రణబీర్ కపూర్ కి వారసత్వంగా వచ్చింది. గత సంవత్సరంలో ఈ బిల్డింగ్‌ను రణబీర్ పూర్తిగా రీ మోడలింగ్ చేయించినట్టు సమాచారం. ఇది ఆరు అంతస్థుల లగ్జరీ బిల్డింగ్ అని తెలుస్తుండగా, ఇందులో అత్యాధునిక సదుపాయాలతో ని పాటు అన్ని వసతులు ఉండేలా రూపొందించబడింది. రూ. 250 కోట్ల విలువైన లగ్జరీ బిల్డింగ్‌ను రణ్‌బీర్ – ఆలియా జంట తమ కుమార్తె రాహా పేరుతో రిజిస్టర్ చేయించారట.
దీనికి సంబంధించిన లీగల్ ప్రక్రియలు కూడా పూర్తయ్యాయని సమాచారం. ఇక త్వరలోనే రణ్‌బీర్ ఫ్యామిలీ ఈ ఇంటిలోకి షిఫ్ట్ అవ్వాలని భావిస్తున్నారు. అయితే రెండేళ్ల వయసులోనే 250 కోట్ల ఆస్తికి యజమానిగా మారిన రాహా, బాలీవుడ్ చరిత్రలోనే రికార్డ్ నెలకొల్పిందని అంటున్నారు. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు “ఇదే భవిష్యత్‌కి ముందస్తు ప్లానింగ్” అంటూ కామెంట్లు చేస్తున్నారు. రాహా కపూర్ చిన్నతనంలోనే స్టార్ వారసురాలిగా గుర్తింపు పొందడం సినిమాప్రియులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.