Ranabaali | రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘రణబాలి’ పై కీలక అప్డేట్ వచ్చింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్, గ్లింప్స్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని క్రియేట్ చేశాయి. భారీ యాక్షన్, పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ముందుగా ఈ సినిమాను సెప్టెంబర్ 11, 2026న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే కొన్ని కారణాలతో విడుదలను వాయిదా వేశారు.తాజాగా ‘రణబాలి’ కొత్త రిలీజ్ డేట్‌ను చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. 2026 అక్టోబర్ 16న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.
ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ పవర్ఫుల్ లుక్‌తో కూడిన కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. పోస్టర్లో కనిపిస్తున్న ఇంటెన్స్ లుక్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. కొత్త రిలీజ్ డేట్ ప్రకారం దసరా సీజన్‌కు దగ్గరగా ‘రణబాలి’ ప్రేక్షకుల ముందుకు రానుంది. పండుగ సెలవులు, భారీ స్టార్ ఇమేజ్ ఉన్న హీరో సినిమా కావడంతో బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్‌పై మేకర్స్ భారీ ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇదే తేదీకి సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘జైలర్ 2’ కూడా ప్రేక్షకుల ముందుకు రానుండటంతో ఆసక్తికరమైన బాక్సాఫీస్ క్లాష్‌కు తెరలేచింది. ఒకవైపు విజయ్ దేవరకొండకు తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ ఇండియా, ఇతర భాషల్లోనూ మంచి మార్కెట్ ఉంది. మరోవైపు రజినీకాంత్‌కు దేశవ్యాప్తంగా భారీ ఫ్యాన్ బేస్ ఉండటంతో ఈ రెండు సినిమాల పోటీపై ఇప్పటి నుంచే చర్చ మొదలైంది.
‘రణబాలి’ని సాధారణ కమర్షియల్ ఎంటర్టైనర్గా కాకుండా భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. 19వ శతాబ్దం నేపథ్యంలో కథ సాగుతుంది. ముఖ్యంగా బ్రిటిష్ పాలన కొనసాగుతున్న సమయంలో 1854 నుంచి 1878 మధ్య జరిగిన చారిత్రక పరిణామాలను ఆధారంగా చేసుకుని ఈ కథను రూపొందిస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు. విజయ్ దేవరకొండ ఈ సినిమాలో ఇంతకుముందెన్నడూ చూడని విధమైన పాత్రలో కనిపించనున్నారని టాక్. పీరియాడిక్ ప్రపంచం, భారీ యాక్షన్ సన్నివేశాలు, అప్పటి కాలానికి సంబంధించిన సెట్స్, విజువల్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని తెలుస్తోంది.