అడ్డగుట్ట : విధుల్లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్‌పై కత్తితో దాడికి యత్నించిన పాత నేరస్తుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించిన ఘటన తుకారాంగేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సర్కిల్ ఇన్స్పెక్టర్ బషీర్ అహ్మద్ వివరాల ప్రకారం.. ఈ నెల 7న సాయంత్రం కుమార్ తన బైక్‌పై షెనాయ్ ఎక్స్ రోడ్డు వైపు వెళ్తుండగా గంగా జమున హోటల్ వద్ద ట్రాఫిక్‌లో ఆగాడు. అదే సమయంలో ఆటోడ్రైవర్ శ్రావణ్ అలియాస్ తుఫాన్ శ్రావణ్(24) తన ఆటోతో ఎడమవైపు నుంచి ఓవర్ టెక్ చేసి బైక్‌ను అడ్డంగా పెట్టి దుర్భాషలాడాడు. కుమార్ పట్టించుకోకుండా వెళ్తుండడంతో కత్తితో శ్రావణ్ అతడిని వెంబడించారు.
అక్కడే విధుల్లో ఉన్న కానిస్టేబుళ్లు రాము, సంజయ్ అడ్డుకోగా పెనుగులాటలో నిందితుడు శ్రావణ్ కత్తితో దాడి చేయడంతో కానిస్టేబుల్ రాము కుడిచేతి బొటనవేలికి గాయమైంది. దీంతో శ్రావణ్ అక్కడి నుంచి పారిపోయాడు. మరుసటి రోజు ఉదయం 5 గంటలకు సుభాశ్ విగ్రహం వద్ద వాహనాల తనిఖీల్లో అదే ఆటోలో వెళ్తున్న శ్రావణ్‌ను పోలీసులు పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి కత్తి స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే అతడిపై ఐదు కేసులు ఉండడంతో పాత నేరస్తుడని తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.