దగ్గుబాటి వారసుడు రానా .. లీడర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు.వైవిధ్యమైన ప్రాజెక్టులు చేసుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చిన రానా బాహుబలి సినిమాలో భళ్లాలదేవుడిగా నటించి అశేష ప్రేక్షకాదరణ పొందాడు. రానా నటించిన ‘విరాటపర్వం’ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. మరో వైపు పవన్ కళ్యాణ్ తో కలిసి భీమ్లానాయక్ సినిమాలో కూడా రానా నటిస్తున్నాడు. ఇంకా పలు సినిమాలు కూడా రానా చేతిలో ఉన్నాయి.
ఇండస్ట్రీలోని నటీనటులతో చాలా ఫ్రెండ్లీగా ఉండే రానా తాజాగా యూనివర్శల్ స్టార్ కమల్ హాసన్ కిడ్స్ శృతి హాసన్ మరియు అక్షర హాసన్లని కలిసి వారితో సరదా సమయం గడిపాడు. అందుకు సంబంధించిన ఫొటోను శృతి హాసన్ షేర్ చేసి ఒక మంచి స్నేహితుడితో మంచి టైమ్ స్పెండ్ చేశాం అంటూ చెప్పుకొచ్చింది. వీరు ఏ సందర్బంలో కలిసి ఉంటారు అనేది ప్రస్తుతం చర్చ జరుగుతోంది
శృతి హాసన్ ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సలార్ చిత్రంతో పాటు పలు తమిళం,హిందీ ప్రాజెక్టులు చేస్తుంది.ఈ ఏడాది శృతి.. క్రాక్, వకీల్ సాబ్, లాభం చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూడు చిత్రాలు మంచి విజయం సాధించడంతో శృతికి ఆఫర్స్ వెల్లువలా వస్తున్నాయి.