Rana | గత కొద్ది రోజులుగా బాలీవుడ్ నటి దీపికా పదుకొణే, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మధ్య వివాదం ఎంత చర్చనీయాంశం అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్పిరిట్ సినిమాకి ముందు ఓకే చెప్పిన దీపిక ఆ తర్వాత పలు కండీషన్స్ పెట్టిందని, స్టోరీ లీక్ చేసిందని, ఆ కారణంగానే సందీప్ తన సినిమా నుండి ఆమెని తప్పించి యానిమల్ హీరోయిన్ తృప్తి డ్రిమీని ఎంపిక చేసాడని అనుకున్నారు. అయితే ఈ అంశంపై అనేక వార్తలు చర్చకు దారి తీసాయి. ఇరువురు పరోక్షంగా విమర్శలు గుప్పించుకున్నారు. నటీనటులకు ఎవరికైనా కథ చెబితే వాళ్లిద్దరి మధ్య అనధికారిక నాన్ డిస్ క్లోజర్ అగ్రిమెంట్ ఉన్నట్లే అంటూ సందీప్ గుర్తు చేసాడు.
దీపికా రోజుకు కేవలం 6 గంటలు మాత్రమే సెట్స్‌లో ఉంటానని చెప్పిందని, 100 రోజులకు మించి షూటింగ్ జరిగితే అదనపు రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు ప్రచారం జరిగింది. తెలుగు డైలాగులు చెప్పడానికి ఇష్టపడలేదని, లాభాల్లో షేర్ కోరినట్లు కూడా వార్తలు వచ్చాయి. అంతేకాక 35 రోజుల షూటింగ్ కు దీపికా ఏకంగా రూ. 25 కోట్లు డిమాండ్ చేసినట్టు కూడా ప్రచారం జరిగింది. అయితే ఈ సమయంలో రానా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రానా నాయుడు ప్రమోషన్స్ లో భాగంగా బాలీవుడ్ కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వర్కింగ్ అవర్స్ అంశం పై స్పందిస్తూ ఇన్‌డైరెక్ట్ గా సందీప్ వంగకు సపోర్ట్ చేసాడు.
రానా మాట్లాడుతూ.. వర్క్ లైఫ్ – పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ గా ఉంటేనే మంచిది. కానీ మాకు సినిమా అనేది పని కాదు ఒక లైఫ్ స్టైల్. వర్కింగ్ అవర్స్ అనేవి సినిమాని బట్టి, వర్కింగ్ ప్లేస్ ని బట్టి కూడా మారుతూ ఉంటాయి. మహారాష్ట్రలో 12 గంటల షిఫ్ట్ ఉంటుంది. బాలీవుడ్ లో 9 గంటలకు షూట్ మొదలుపెడతారు. తెలుగులో ఉదయం 7 గంటలకే షూటింగ్ మొదలు పెడతాం అలాగే షూటింగ్ జరిగే ప్రదేశం, సెట్, నగరం.. ఇలాంటివన్నీ కూడా వర్కింగ్ అవర్స్ మీద ప్రభావం చూపిస్తాయి. ఒక రోజులో రెండు షూట్ లు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ ఎవరూ ఎవర్ని ఇన్ని గంటలు పనిచేయమని బలవంతం చేయరు. ఇది ఒక ఉద్యోగం లాంటిదని రానా పేర్కొన్నాడు. ఎవరి అభిప్రాయం వాళ్లకు ఉంటుంది. రోజుకు నాలుగు గంటలు మాత్రమే పనిచేసే నటులు కూడా ఉన్నారంటూ రానా స్పష్టం చేశారు. సినిమా అనేది 9-5 జాబ్ కాదని, షూటింగ్, లొకేషన్, సీన్స్ టైమింగ్ ని బట్టి షూట్ జరుగుతుందంటూ పలువురు సెలబ్స్ గతంలో పేర్కొన్నారు.