Rana Naidu Season 2 | టాలీవుడ్ హీరోలు దగ్గుబాటి వెంకటేశ్ (Venkatesh), రానా (Rana) కాంబోలో వచ్చిన నెట్‌ఫ్లిక్స్ (Netflix) వెబ్ సిరీస్ రానా నాయుడు (Rana Naidu). అమెరికన్ హిట్ సిరీస్ రే డోనోవ్యాన్‌కు అడాప్షన్గా తెరకెక్కిన ఈ సిరీస్ తెలుగు, తమిళంతోపాటు వివిధ భాషల్లో విడుదలయ్యి మంచి రికార్డు వ్యూస్ సాధించిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో తండ్రీ కొడుకులుగా నాగానాయుడు (వెంకటేశ్), రానా నాయుడు (రానా) మధ్య నడిచే ట్రాక్‌లో కొన్ని అభ్యంతరకర సన్నివేశాలు పక్కన పెడితే.. మిగిలిన ట్రాక్ ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. అయితే ఈ సిరీస్‌కు సీజన్ రాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే రానా నాయుడు సీజన్ 2 గ్లింప్స్ వీడియోను విడుదల చేసింది. ఇప్పుడు తాజాగా మూవీ టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్.
టీజర్ చూస్తుంటే.. కొత్త సీజన్లో విలన్‌గా బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ నటించబోతున్నట్లు తెలుస్తుంది. ఆసక్తికరంగా సాగిన ఈ టీజర్‌ను మీరు చూసేయండి. కరణ్ అన్షుమన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సిరీస్ విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నట్లు చిత్రబృందం తెలిపింది.