అతిథి పాత్రలో

65

అతిథి పాత్రలో


గోపీచంద్‌ కథానాయకుడిగా తేజ దర్శకత్వంలో ‘అలిమేలుమంగ వేంకటరమణ’ పేరుతో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను రూపొందించబోతున్నారు. ఇందులో రానా కీలకమైన అతిథి పాత్రలో కనిపించబోతున్నాడని తెలిసింది. ైక్లెమాక్స్‌ ఘట్టాల్లో వచ్చే ఈ అతిథి పాత్రకు కథాగమనంలో ఎంతో ప్రాముఖ్యత ఉంటుందట. ఈ చిత్రంలో కథానాయికగా అనుష్క లేదా కీర్తి సురేష్‌ నటించనున్నట్లు సమాచారం.