సీనియర్ సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ సాలూరి హీరోగా, వర్ష విశ్వనాథ్ హీరోయిన్గా నటిస్తున్న చిత్రం ‘11:11’. కిట్టు నల్లూరి దర్శకుడు. గాజుల వీరేష్ నిర్మాత. ఈ చిత్రం మోషన్ పోస్టర్ను ఇటీవల హీరో రానా విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ. ప్రతి సన్నివేశం అందరిలోనూ వాట్ నెక్ట్స్ అనే ఆసక్తిని కలిగిస్తుంది. ఈ థ్రిల్లింగ్ కాన్సెప్ట్ మూవీకి మణిశర్మ అందించిన నేపథ్య సంగీతం బలంగా నిలుస్తుంది’ అన్నారు. రోహిత్, లావణ్య, రాజా రవీంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంభాషణలు: పవన్ కె అచల.