Rana Daggubati | దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి కలిసి నిర్మించి నటిస్తున్న పీరియాడిక్ డ్రామా ‘కాంత’ ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. పాతతరం సినిమా ఇండస్ట్రీ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం కథ ఎవరినైనా ఉద్దేశించి ఉందా? లేదా సినీ పరిశ్రమలోని చీకటి కోణాలను చూపిస్తుందా? అనే ప్రశ్నలు ప్రేక్షకుల మధ్య చర్చనీయాంశంగా మారాయి.హైదరాబాద్‌లో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో రానా దగ్గుబాటి ఈ సందేహాలకు స్వయంగా క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. ఈ సినిమా చూసి ఎవరూ హర్ట్ అవ్వరు. ఇది కచ్చితంగా చెప్పగలను అని అన్నారు.
రానా మాట్లాడుతూ.. మీరు ఇండస్ట్రీ డార్క్ సైడ్ అన్నారు కానీ, ‘కాంత’ సినిమా దాని గురించి కాదు. మనుషుల్లో ఉండే డార్క్ సైడ్, ఈగో గురించే ఈ సినిమా. ప్రతి వ్యక్తిలో ఒక డార్క్ ఈగో ఉంటుంది. అదే ఈ కథకు బేస్. సినిమా ఇండస్ట్రీ బ్యాక్‌డ్రాప్ కేవలం నేపథ్యమే కానీ, అసలు కథ గురు–శిష్యుల మధ్య జరిగే భావోద్వేగ ఘర్షణ,” అని స్పష్టం చేశారు. అదే సమయంలో “ఈ సినిమా ఏ నిజ ఘటన ఆధారంగా తీసింది?” అనే ప్రశ్నకు రానా సమాధానమిస్తూ.. ఏ ఒక్క ట్రూ ఇన్సిడెంట్‌పై కాదు. కానీ మేము అనేక సంఘటనల నుండి స్ఫూర్తి పొందాం. ఇది ఎవరినీ టార్గెట్ చేసిన సినిమా కాదు అని తేల్చి చెప్పారు.మొత్తం మీద, రానా మాటలతో ‘కాంత’ సినిమా అసలు సారాంశం బయటపడింది .
ఇది సినిమా ఇండస్ట్రీ కథ కాదు, మనిషి లోపలి ఈగో మరియు అహంకారం చుట్టూ తిరిగే యూనివర్సల్ ఎమోషన్ డ్రామా అని రానా మాటలని బట్టి అర్ధమవుతుంది. దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. రానా ఇచ్చిన ఈ క్లారిటీతో ‘కాంత’పై అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమా బాక్సాఫీస్‌ని షేక్ చేసేలా ఉంది.