‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది పూణే భామ భాగ్యశ్రీబోర్సే. ప్రస్తుతం భాగ్యశ్రీ బోర్సే చేస్తున్న క్రేజీ ప్రాజెక్టుల్లో ‘కాంత’ ఒకటి. దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటిస్తూ, రానా దగ్గుబాటితో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సెల్వమణి సెల్వరాజ్ దర్శకుడు. ఈ చిత్రం ప్రారంభోత్సవం ఇటీవలే ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. రీసెంట్గా ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైంది.
ఈ విషయాన్ని తెలియజేస్తూ లొకేషన్లో దుల్కర్‌తో కలిసి ఉన్న తన ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేసింది భాగ్యశ్రీ బోర్సే. ‘ ‘కాంత’ ప్రపంచంలో మ్యాజిక్ ఎక్స్‌పీరియన్స్‌ని ఆస్వాదించడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా..’ అంటూ ఆ ఫొటోతో పాటు కామెంట్ కూడా జత చేసింది. ఇక ఈ సినిమా విషయానికొస్తే.. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో 1950 నాటి మద్రాసు మహానగరంలో జరిగిన కథగా ఈ సినిమాను దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ తెరకెక్కిస్తున్నారు. సముద్రఖని కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు.