రానా సరికొత్త ప్రయోగం.. సూపర్ హీరో కాన్సెప్ట్‌తో భారీ సినిమా
తెలుగు ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు చేయడానికి రానా దగ్గుబాటి సిద్ధంగా ఉంటాడు. రొటీన్ కథలు చేయడం అంటే ఈయనకు అస్సలు నచ్చదు. అందుకే కాస్త విభిన్నంగా ఉండే కథల వైపు అడుగులు వేస్తూ ఉంటాడు రానా.

తెలుగు ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు చేయడానికి రానా దగ్గుబాటి సిద్ధంగా ఉంటాడు. రొటీన్ కథలు చేయడం అంటే ఈయనకు అస్సలు నచ్చదు. అందుకే కాస్త విభిన్నంగా ఉండే కథల వైపు అడుగులు వేస్తూ ఉంటాడు రానా. మిగిలిన హీరోల మాదిరిగా తనకు ఆరు పాటలు, నాలుగు ఫైట్లు, మూడు కామెడీ సీన్లు కావాలి అని అడగడు. తన పాత్ర బాగుంటే చాలు.. అతిథి పాత్రలో కూడా నటించడానికి సిద్ధమే అంటాడు రానా దగ్గుబాటి. ప్రస్తుతం ఆయన నటించిన విరాటపర్వం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో పాటు మరో రెండు మూడు సినిమాలకు కమిట్మెంట్ ఇచ్చాడు రానా.
అందులో పవన్ కళ్యాణ్ సినిమా కూడా ఉంది. మలయాళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమా రీమేక్‌లో పవన్‌తో పాటు నటిస్తున్నాడు రానా. దీంతో పాటు మరో రెండు సినిమాల్లో హీరోగా చేస్తున్నాడు. అయితే పవన్ సినిమా పూర్తయిన తర్వాత ఒక సూపర్ హీరో కాన్సెప్ట్‌తో సినిమా చేయబోతున్నట్లు అనౌన్స్ చేశాడు రానా. సాధారణంగా సూపర్ హీరోలు అంటే హాలీవుడ్ గుర్తుకొస్తుంది. హిందీలో కూడా హృతిక్ రోషన్ సూపర్ హీరో కాన్సెప్ట్‌తో క్రిష్ చేశాడు. కానీ తెలుగులో ఆ స్థాయి సినిమా ఇప్పటివరకు రాలేదు.
న్టీఆర్ లాంటి హీరోలు సూపర్‌మ్యాన్ సినిమాలో నటించినా కూడా పెద్దగా వర్కవుట్ కాలేదు. అయితే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ రేంజ్ పెరిగింది. ఎంత బడ్జెట్ అయినా పెట్టడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలోనే రానా దగ్గుబాటి ఒక సూపర్ హీరో సినిమా చేయబోతున్నాడు. దీనికోసం కథ కూడా సిద్ధం చేయిస్తున్నాడు. ఇది ఎక్కువ టైమ్ కూడా పట్టకపోవచ్చు. పవన్ సినిమా పూర్తయిన వెంటనే ఈ సూపర్ హీరో సినిమా చేస్తానని అంటున్నాడు రానా. ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలోనే కాదు సౌత్‌లో ఎవరూ చేయని విధంగా ఈ సినిమా ఉండబోతోందని క్లారిటీ ఇచ్చాడు. దగ్గుబాటి వారసుడి అనౌన్స్మెంట్ తర్వాత దీనిపై అంచనాలు కూడా పెరిగిపోయాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
బ్రహ్మాజీతో జాగ్రత్తగా ఉండు.. నాగశౌర్యకు రానా సూచన
ఆర్య ఇంట డబుల్ ధమాకా.. తల్లి అయిన అఖిల్ హీరోయిన్.. విశాల్ ఎమోషనల్
RRR సినిమా విషయంలో వివాదాలు తప్పవా?
పవర్ స్టార్‌తో ఆ హీరోయిన్ నాలుగో పెళ్లి.. ఫోటో వైరల్?
జూనియర్ ఎన్టీఆర్ కొత్త కారు వచ్చేసింది.. చరణ్ ఇంటి ముందు పార్కింగ్..!
త్రిష పెళ్లి టాపిక్ మళ్లీ వైరల్..ఇంతకీ ఎవరా వ్యక్తి.?
రాజ్ కుంద్ర సంస్థకు శిల్పాశెట్టి రాజీనామా
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

