Jayammu Nischayammu Raa | తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్స్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన హీరోయిన్ రమ్యకృష్ణ . ఇటీవల జీ తెలుగు షో జయమ్ము నిశ్చయమ్మురాలో సందడి చేసింది. గ్లామర్ హీరోయిన్గా కెరీర్ ప్రారంభించిన రమ్యకృష్ణ, రాఘవేంద్రరావు దర్శకత్వంలో వరుసగా సినిమాలు చేసి స్టార్ స్టేటస్ దక్కించుకుంది. ఇక బాహుబలిలో శివగామి పాత్ర ద్వారా కెరీర్లో మరో మెట్టు ఎక్కిన విషయం తెలిసిందే. తాజాగా జగపతి బాబు షోకి హాజరైన రమ్యకృష్ణ ఆసక్తికర కామెంట్స్ చేసింది. అయితే రమ్యకృష్ణ ఎంట్రీతో షో హోస్ట్ జగపతిబాబు కుర్రాడిలా మారి, స్టైలిష్‌గా ప్రవర్తించడం, టీషర్ట్‌లో యంగ్ లుక్‌లో కనిపించడం, స్టెప్పులేసి రమ్యకృష్ణని ఇంప్రెస్ చేసుకోవడానికి ప్రయత్నించడం హైలైట్‌గా నిలిచింది.
రమ్యకృష్ణ, తన ఫన్నీ ఎక్స్‌ప్రెషన్స్‌తో జగపతిబాబును కవర్ చేయడం, కౌంటర్ ఇచ్చి షోను మరింత ఆసక్తికరంగా మార్చడం ప్రేక్షకులను అలరించింది.మొత్తంగా రమ్యకృష్ణ, జగపతిబాబు మధ్య ఫన్నీ కౌంటర్ డైలాగ్స్, ఎంటర్టైనింగ్ ఎక్స్ప్రెషన్స్లు షోను సక్సెస్‌ఫుల్‌గా మార్చనున్నాయి.‘నీకు చిన్నప్పట్నుంచి చాలా మంది సైట్ కొట్టడం, ప్రేమించడం, పడి దొర్లడం.. అని జగపతిబాబు చెబుతుండగానే .. ‘ఇన్క్లూడింగ్ యూ(నువ్వు కూడా)` అంటూ జగ్గు బాయ్ ముఖం మీదే నవ్వుతూ చెప్పేసింది. దీనికి జగపతి బాబు కూడా స్మైలింగ్ ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమోలు నెట్టింట వైరలవుతున్నాయి.
కాగా, రమ్యకృష్ణ పాజిటివ్, నెగటివ్ పాత్రలలో ఆకట్టుకుంటూ ఉంటే, జగపతిబాబు కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పవర్ఫుల్ రోల్స్‌తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇలాంటి ఎంటర్టైనింగ్ కంటెంట్, బలమైన పాత్రల కలయిక, ప్రేక్షకుల మన్ననలు రమ్యకృష్ణ, జగపతిబాబులని టాప్ ఫేవరేట్స్‌గా నిలబెట్టింది. జగపతిబాబు, రమ్యకృష్ణ కలిసి పలు సినిమాల్లో నటించారు. ఆయనకు ఇద్దరు, బడ్జెట్ పద్మనాభం తదితర చిత్రాల్లో హీరో, హీరోయిన్లుగా నటించారు. ఇక జగపతి బాబు ప్రస్తుతం విలన్ గా, సహాయక నటుడిగా రాణిస్తున్నారు. అలాగే టీవీ షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.