కరోనా మహమ్మారి టాలీవుడ్‌కి నిద్ర లేకుండా చేస్తుంది. అన్ని జాగ్రత్తలు తీసుకొని షూటింగ్ చేస్తున్నప్పటికీ చిత్ర బృందంలో ఎవరో ఒకరు కరోనా బారిన పడుతున్నారు. దీంతో షూటింగ్ వాయిదా వేయాల్సిన పరిస్థితి నెలకొంటుంది. తాజాగా రవితేజ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఖిలాడి చిత్ర దర్శకుడు రమేష్ వర్మకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిన వెంటనే క్వారంటైన్లో ఉండి చికిత్స తీసుకుంటున్నాను. అందరు మాస్క్ ధరించాలి. అత్యవసరాలకు మినహాయించి బయట తిరగడం మానేయాలంటూ ప్రశాంత్ వర్మ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
రమేష్ వర్మ తెరకెక్కిస్తున్న ఖిలాడి చిత్రాన్ని మే 28న విడుదల చేయాలని మేకర్స్ భావించగా, ఇప్పుడు ఆయనకు కరోనా సోకడం ఇబ్బందిగా మారింది. ఖిలాడి చిత్ర షూటింగ్ కొంత బ్యాలెన్స్ ఉండగా, దానిని త్వరగా పూర్తి చేసి అనుకున్న టైంకు చిత్రాన్ని రిలీజ్ చేస్తారా లేదంటే కొద్ది రోజులు వాయిదా వేస్తారా అన్నది చూడాలి.
Hello everyone ,
— Ramesh Varma (@DirRameshVarma) April 19, 2021
I have tested positive for #Covid19 and quarantined myself as a part of a safeguard measure.
Please wear the mask and try not to go out unnecessarily! Stay safe guys, love you all.