అభిమానులు ఎల్లప్పుడూ తనకు, తారక్‌కు తోడున్నారని.. ఒక షాడోలా ఎప్పుడూ తమ వెంట ఉన్నందుకు చాలా థ్యాంక్స్ అంటూ మెగా ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు రామ్ చరణ్ కృతజ్ఞతలు తెలిపారు. కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్‌లో జరిగిన ఆర్ఆర్ఆర్ ప్రీరిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన రామ్‌చరణ్.. ఖచ్చితంగా అందరూ థియేటర్లలోకి వెళ్లి సినిమా చూడాలని కోరారు.
పునీత్ రాజ్‌కుమార్ లేరంటే నేను నమ్మలేకపోతున్నాను. ఆయన ఇక్కడే ఉంటూ అందరినీ ఆశీర్వదిస్తున్నారు. ఆయన లేని లోటును శివన్న ద్వారా తీర్చుకుంటాం.
చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్న తారక్ అభిమానులందరికీ.. ఈ ఈవెంట్‌ను మెగా సక్సెస్ చేసిన మెగా అభిమానులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మీరు ఎప్పుడూ నీడలా నాకు, తారక్‌కు ఉన్నారు. మార్చి 25న మేము పడిన కష్టం, శ్రమకు ఫలితం దక్కబోతోంది. నేను జీరో ఫీలింగ్స్‌తో సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను.
ఏపీ, తెలంగాణ తర్వాత కర్ణాటక పెద్ద మార్కెట్. సినిమాను కర్ణాటక ప్రజలు ఆదరించాలి. రాజమౌళి టీం అందరికీ ధన్యవాదాలు.. అని రామ్ చరణ్ అన్నారు.