Ramcharan | గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద సూపర్ క్రేజ్ సంపాదించుకొని ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న అతి కొద్ది మంది టాలీవుడ్ యాక్టర్లలో ఒకడు రాంచరణ్ (Ramcharan). ఆర్ఆర్ఆర్ సినిమాతో వరల్డ్‌వైడ్‌గా అదిరిపోయే స్టార్ ఇమేజ్‌తో గ్లోబల్ స్టార్‌గా మారిపోయాడు. రాంచరణ్‌కు ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు అభిమానులుగా మారిపోయారని తెలిసిందే.
తాజాగా ఈ జాబితాలో అమెరికన్ పాపులర్ డీజే బ్యాండ్ ది చైన్ స్మోకర్స్ చేరిపోయింది. ది చైన్ స్మోకర్స్ మెంబర్ అలెగ్జాండర్ అలెక్స్ ఓ షోలో ఈ విషయాన్ని చెప్పాడు. మీకు ఒకవేళ అవకాశమొస్తే ఏ బాలీవుడ్ లేదా భారతీయ నటుడితో పనిచేయాలనుకుంటున్నారు.. అని ది చైన్ స్మోకర్స్ మెంబర్ అలెగ్జాండర్ అలెక్స్ పాల్‌ను అడిగాడు యాంకర్. దీనికి రాంచరణ్ అని సమాధానం ఇచ్చాడు అలెక్స్ . ఆర్ఆర్ఆర్లో నమ్మశక్యం కాని యాక్టింగ్‌తో అదరగొట్టేశాడని అన్నాడు. ఈ కామెంట్స్‌తో రాంచరణ్ క్రేజ్ ఏ రేంజ్లో పెరిగిపోయిందో మరోసారి అర్థమవుతుంది.
రాంచరణ్ ప్రస్తుతం RC15గా వస్తోన్న గేమ్ చేంజర్ షూటింగ్‌ను పూర్తి చేసే పనిలో ఉన్నాడని తెలిసిందే. మరోవైపు బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఆర్సీ 16గా స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఈ మూవీని సుకుమార్ రైటింగ్స్-మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. దీంతోపాటు హోం బ్యానర్ సుకుమార్ రైటింగ్స్‌పై సుకుమార్ దర్శకత్వంలో ఆర్సీ 17లో కూడా నటిస్తు్న్నాడు.
The Chainsmokers Want To Work With RamCharan 🔥 @AlwaysRamCharan 😎#RamCharan #RRR pic.twitter.com/668gqSp6QD
— John Wick (@JohnWick_fb) June 7, 2024