Ramayana | బాలీవుడ్లో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక సినిమా ‘రామాయణ’ ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రముఖ దర్శకుడు నితేశ్ తివారీ ఈ ప్రాజెక్ట్‌ను భారీ బడ్జెట్ో తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రధాన పాత్రలకు ఎంపికైన నటీనటులు, వారి పారితోషికాలు, సినిమా బడ్జెట్ ఇవన్నీ కూడా ఈ ప్రాజెక్ట్‌ను దేశంలోనే అత్యంత భారీ చిత్రాల్లో ఒకటిగా నిలిపేలా చేశాయి. ఈ చిత్రంలో రాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్ నటిస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఆయన ఒక్కో భాగానికి రూ.75 కోట్లు, మొత్తంగా రూ.150 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నట్లు సమాచారం. ఇది ఆయన కెరీర్లోనే కాదు, బాలీవుడ్‌లోనూ అత్యధిక రెమ్యునరేషన్ల్లో ఒకటిగా నిలుస్తోంది.
సీత పాత్రలో సాయి పల్లవి కనిపించనున్నారు. ఆమె కూడా భారీ పారితోషికం తీసుకుందనే టాక్ నడుస్తుంది. ఈ సినిమా కోసం సాయి పల్లవి సుమారు రూ.12 కోట్లు తీసుకున్నట్టు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్‌తో సాయి పల్లవికి బాలీవుడ్లో విపరీతమైన క్రేజ్ రానుందని అంటున్నారు. ఇక చిత్రంలో రావణుడి పాత్రలో కన్నడ రాక్‌స్టార్ యష్ కనిపించనున్నారు. ఆయన కూడా భారీ రెమ్యునరేషనే తీసుకున్నాడట. ఏకంగా వంద కోట్లు డిమాండ్ చేసినట్టు ప్రచారం జరుగుతుంది. అతను ఈ సినిమాకు సహ నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు. రావణుడి భార్య మండోదరి పాత్రలో కాజల్ అగర్వాల్ నటించే అవకాశాలు ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఈ ప్రాజెక్ట్ మొత్తం రూ.1,600 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతుండగా,మొదటి భాగానికి రూ.900 కోట్లు,రెండో భాగానికి రూ.700 కోట్లు ఖర్చవుతున్నట్లు తెలుస్తోంది. ఇది నిజమైతే, ‘రామాయణ’ భారత సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదైన సినిమాగా నిలవనుంది. మొదటి భాగం 2026 దీపావళి కానుకుగా విడుదల కానుండగా, రెండో భాగం 2027 దీపావళికి రానుంది. ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనుండటం మరో హైలైట్. విజువల్స్, సంగీతం, నటన వంటి అంశాలతో ఈ చిత్రం ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభవం అందించనుందని అంటున్నారు. ఈ భారీ రామాయణ ప్రాజెక్ట్‌పై ఇండియా వైడ్‌గానే కాదు, గ్లోబల్ లెవెల్లోనూ ఆసక్తి నెలకొనడం ఖాయం.