Ramayana | భారతీయ సినీ పరిశ్రమ నుంచి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌లలో ఒకటైన రామాయణ పై రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. రణబీర్ కపూర్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని నితీష్ తివారి భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించడంతో, ఈ సినిమాపై హైప్ మరింత పెరిగింది. విజువల్స్, మేకింగ్ స్టాండర్డ్స్ ఇప్పటికే హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయని అందరు భావిస్తున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్‌కు సంగీతం అందిస్తున్న వారు కూడా పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్స్ కాగా వారు హాలీవుడ్ దిగ్గజం హన్స్ జిమ్మర్, ఇండియన్ లెజెండ్ ఏ.ఆర్. రెహమాన్.
ఈ ఇద్దరు కలిసి ఈ సినిమాకు సంగీతం అందించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఏ.ఆర్. రెహమాన్ ఈ చిత్రానికి ఏకంగా రూ.30 కోట్ల పారితోషకం అందుకున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ వార్త నిజమైతే, ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యధిక పారితోషకం అందుకున్న సంగీత దర్శకుడిగా రెహమాన్ నిలిచే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఏ సంగీత దర్శకుడూ ఈ స్థాయిలో రెమ్యునరేషన్ పొందలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో యశ్, సన్నీ డియోల్, మాధవన్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాత నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్నారు.
అత్యాధునిక సాంకేతికతతో, భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ ఏడాది దీపావళి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రామాయణ చిత్రం కేవలం కథ, విజువల్స్ మాత్రమే కాదు, సంగీతం పరంగానూ కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేయబోతోందని స్పష్టమవుతోంది. ఇక ఏ.ఆర్. రెహమాన్ రూ.30 కోట్ల రెమ్యునరేషన్ వార్త నిజమా కాదా అన్నది తెలియాల్సి ఉన్నా, ఈ సినిమా పై అంచనాలు మాత్రం ఆకాశాన్నంటుతున్నాయి.