Skanda Movie | కోట్లు కొల్లగొడుతున్న డిజాస్టర్ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర స్కంద మాస్ ర్యాంపేజ్..!
Skanda Movie | సినిమా హిట్టా ఫట్టా అనేది తొలి ఆటకే తెలిసిపోతుంది. హిట్టు టాక్ వస్తే కలెక్షన్లు మోతమోగిపోతుంటాయి. అదే ఫట్టు అని తెలిస్తే పోస్టర్ ఖర్చులు కూడా వెనక్కి తీసుకురావడం కష్టం. అయితే స్కంద మాత్రం దీనికి భిన్నంగా బాక్సాఫీస్ దగ్గర కోట్లు కొల్లగొడుతుంది.
Skanda Movie | సినిమా హిట్టా ఫట్టా అనేది తొలి ఆటకే తెలిసిపోతుంది. హిట్టు టాక్ వస్తే కలెక్షన్లు మోతమోగిపోతుంటాయి. అదే ఫట్టు అని తెలిస్తే పోస్టర్ ఖర్చులు కూడా వెనక్కి తీసుకురావడం కష్టం. అయితే స్కంద మాత్రం దీనికి భిన్నంగా బాక్సాఫీస్ దగ్గర కోట్లు కొల్లగొడుతుంది. ఈ సినిమా తొలిరోజే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అయినా కానీ రామ్ కెరీర్లో బెస్ట్ ఓపెనింగ్స్ తీసుకొచ్చింది. తొలిరోజు కదా ఎలాగో వస్తుందనుకుంటే రెండో రోజు కూడా డీసెంట్ కలెక్షన్లు రాబట్టింది. ఇక ఈ సినిమాకు వచ్చిన టాక్‌కు మహా అయితే రెండు రోజులు థియేటర్లు ఊగిపోతాయి.. మూడో రోజు నుంచి ఒక్కరు కూడా థియేటర్ల వైపు చూడరు అనుకున్నారు.
అయితే స్కంద మాత్రం అందరి అంచనాలను తారు మారు చేస్తూ దూసుకుపోతుంది. కేవలం నాలుగు రోజుల్లోనే రూ.40 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టింది. ఇది అహా ఓహో అనిపించే నెంబర్ కాకపోవచ్చు.. కానీ ఈ సినిమాకొచ్చిన టాక్‌కు ఇది చాలా పెద్ద నెంబర్. ఇక ఈ సినిమాకు పోటీగా రిలీజైన చంద్రముఖి-2, పెదకాపు-1 సినిమాలు దీనికంటే డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో.. జనాలకు ఇదొక్కటే ఆప్షన్ అయిపోయింది. అందులోనూ బోయాపాటి డైరెక్టర్ కాబట్టి ఫైట్స్ గట్రా చూడొచ్చులే అని జనాలు ఓ సారి చూసేస్తున్నారు. మరీ ముఖ్యంగా బీ, సీ సెంటర్ల ఆడియెన్స్ ఈ సినిమాను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఈ రోజు పబ్లిక్ హాలీడే అవడంతో స్కందకు మరింత కలిస వచ్చింది.
సోమవారం కలెక్షన్లతో హాఫ్ సెంచరీ దాటేయడం పక్కా అని ట్రేడ్ వర్గాల టాక్. ఇక సోమవారం నుంచి ఈ సినిమాకు ఫుల్ డ్రాప్స్ పడే అవకాశాలు ఉన్నాయి. శ్రీలీల హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు థమన్ సంగీతం అందించాడు. ఇక ఈ సినిమా సీక్వెల్ కూడా ఉండబోతుందని బోయపాటి క్లైమాక్స్‌లో క్లారిటీ ఇచ్చాడు. మరీ సినిమా రిజల్ట్ చూసి.. సీక్వెల్ ఆలోచనను పక్కన పెట్టేస్తారా.. లేదంటే తీస్తారా అనేది తెలియాల్సి ఉంది.
A Sensational Sunday!🔥
Thundering Blockbuster #Skanda continues its unwavering Box-office run with 43.9 Crores Gross in 4 Days🥳💥#SkandaRampage in 2nd Week is loading 🔥
Ustaad @ramsayz #BoyapatiSreenu @sreeleela14 @saieemmanjrekar @MusicThaman… pic.twitter.com/y7THK20s27
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) October 2, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvinder Jhota: డ్రగ్స్ అమ్మడాన్ని ప్రశ్నించిన పర్వీందర్.. ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్‌లోనే కాల్చివేత
Chakali llamma | చాకలి ఐలమ్మ విగ్రహ ధ్వంసంపై పద్మా దేవేందర్‌రెడ్డి ఆగ్రహం
Harsha | నెట్‌ఫ్లిక్స్‌లో హర్ష వెబ్‌సిరీస్ జోరు.. ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ను వెనక్కి నెట్టి టాప్‌లోకి!
Journalist Richa: కిందపడేలా రాహుల్ గాంధీ తోశాడు.. ప్రెగ్నెంట్ జర్నలిస్టు ఆరోపణ
Imran Khan | ముంబై నిరసనలో పాల్గొన్న ఆమిర్ ఖాన్ మేనల్లుడు.. దేశం నుంచి బహిష్కరించాలన్న బీజేపీ నేత
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

