రామ్ పోతినేని, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ ఎంతటి విజయాన్ని అందుకుందో తెలిసిందే. ఆ సినిమాకు కొనసాగింపుగా అదే కాంబినేషన్లో రాబోతున్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. పూరి కనెక్ట్స్ బేనర్‌పై పూరీజగన్నాథ్, ఛార్మి కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం ముంబయిలో షూటింగ్ జరుపుకుంటున్నది. తన గత చిత్రం ‘స్కంద’ కోసం బరువు పెరిగిన రామ్, ఈ ‘డబుల్ ఇస్మార్ట్’కోసం కొన్ని కిలోల బరువు తగ్గి సిక్స్ప్యాక్లోకి వచ్చారు.
ఈ సందర్భంగా రామ్ కొత్త అవతారాన్ని బుధవారం మేకర్స్ మీడియాకు విడుదల చేశారు. ‘ఇస్మార్ట్ శంకర్’కు మరోస్థాయిలో ఈ సినిమా ఉంటుందని, సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాలతో హైబడ్జెట్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని పూరీ చెప్పారు. పాన్ ఇండియా స్థాయిలో వచ్చే ఏడాది మార్చి 8న శివరాత్రి కానుకగా సినిమాను విడుదల చేస్తామని బుధవారం ఓ ప్రకటన ద్వారా పూరీ తెలియజేశారు. సంజయ్‌దత్ ఇందులో ప్రత్యేకపాత్ర పోషిస్తుండటం విశేషం.
I’M BACK!
-Ustaad #DOUBLEiSMART Shankar pic.twitter.com/jgo6u9UNDR
— RAm POthineni (@ramsayz) November 1, 2023