Skanda Movie | ఇప్పటికిప్పుడు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లో దిట్ట ఎవరంటే టాలీవుడ్ నుంచి వినిపించే ఒకే ఒక్క పేరు థమన్. గత మూడేళ్లుగా టాలీవుడ్లో థమన్ హవా ఏ రేంజ్లో ఉందంటే.. కాస్త రిలీజ్ ఆలస్యమైనా సరే థమనే సంగీతం కొట్టాలి అనే రేంజ్‌కు దూసుకెళ్లాడు. పాటలు సో సోగా అనిపించినా.. బ్యాక్‌గ్రౌండ్ కొట్టడంలో థమన్‌కు మించినోరు లేరు. అఖండ అంత పెద్ద హిట్టవ్వడానికి మేయిన్ రీజన్ థమనే. ఇక అలవైకుంఠపురంలో ఈ రేంజ్ బ్లక్ బస్టర్ అవడానికి వెనుక ఉంది కూడా థమనే. ఈ విషయాలన్ని స్వయంగా ఆ సినిమా మేకర్స్ చెప్పినవే. అంతలా తన మ్యూజిక్‌తో థియేటర్లను ఊపేస్తాడు.
కాగా తాజాగా థమన్ సంగీతం అందించిన స్కంద రిలీజ్‌కు రెడీగా ఉంది. ఇక రామ్ ఈ సినిమా ప్రమోషన్లు జోరుగా జరుపుతున్నాడు. ఈ క్రమంలో స్కంద మ్యూజిక్ గురించి మాట్లాడుతూ థమన్‌ను ఓ రేంజ్లో ఆకాశానికి ఎత్తేశాడు. స్కంద సినిమాకు థమన్ ఇచ్చిన మ్యూజిక్ వేరే లెవల్లో ఉంటుంది. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ ఎపిసోడ్ గూస్బంప్స్ అంతే. థమన్ మ్యూజిక్కు స్పీకర్స్ బ్లాస్ట్ అవడం పక్కా. థియేటర్ ఓనర్లు మళ్లీ కొత్తగా రెనోవేట్ చేసుకోవాల్సిందే అనే రేంజ్లో థమన్‌కు ఎలివేషన్ ఇచ్చాడు. మరి నిజంగానే థమన్ ఆ రేంజ్లో అవుట్ పుట్ ఇచ్చాడా అనేది చూడాలి.
ఇప్పటివరకు రిలీజైన పాటలన్నీ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మరీ ముఖ్యంగా కల్ట్ మామా సాంగ్ అయితే జనాలకు విపరీతంగా ఎక్కేసింది. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో రామ్‌కు జోడీగా శ్రీలీల నటించింది. ఇక అదే రోజున చంద్రముఖి-2 కూడా రిలీజ్ కాబోతుంది. ఇప్పటివరకైతే ఈ సీక్వెల్‌పై జనాల్లో పెద్దగా అంచనాల్లేవు. అయితే హార్రర్ జోనర్ కాబట్టి ప్రేక్షకులు కాస్త కనెక్ట్ అయినా బంపర్ హిట్టు చేసేస్తారు.