రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న 22వ చిత్రానికి ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ‘మిస్‌శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ ఫేమ్ మహేష్‌బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నది. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. ఉపేంద్ర ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. గురువారం హీరో రామ్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇందులో హీరో రామ్.. టాప్ హీరో ఆంధ్ర కింగ్ సూర్యకుమార్ అభిమానిగా కనిపించారు.
సినిమా రిలీజ్ రోజు తన అభిమాన హీరో ైస్టెల్‌ని అనుకరిస్తూ థియేటర్లోకి ఎంట్రీ ఇచ్చిన రామ్…‘ఆంధ్రాకింగ్ ఫ్యాన్స్ తాలూకా..’ అంటూ యాభై టిక్కెట్లు అడుగుతాడు. వెంటనే మేనేజర్ టిక్కెట్లు ఇస్తాడు. దాంతో తను ఫ్యాన్స్‌తో కలిసి సంబరాలు చేసుకుంటాడు. అభిమాని పాత్రలో రామ్ సరికొత్త మేకోవర్‌తో కనిపించారు. విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. రావు రమేష్, మురళీశర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సిద్ధార్థ నుని, సంగీతం: వివేక్-మెర్విన్, నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై.రవిశంకర్.