Vivek-Mervin | రామ్ పోతినేని కథానాయకుడిగా మహేశ్‌బాబు.పి దర్శకత్వంలో మైత్రీ మూవీమేకర్స్ అధినేతలు నవీన్ యర్నేని, రవిశంకర్ యలమంచిలి ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ద్వారా కోలీవుడ్ సంగీత దర్శకులు వివేక్-మెర్విన్ తెలుగు సినిమాకు పరిచయం అవుతున్నారు. ఈ సంగీతదర్శక ద్వయానికి రామ్ తన సోషల్‌మీడియా ద్వారా స్వాగతం పలికారు. ‘తెలుగు తెరపై సరికొత్త సంగీత సంచలనానికి స్వాగతం’ అంటూ రామ్ ట్వీట్ చేశారు.
తొలి సినిమా ‘వడా కర్రీ’ వీరికి మంచి పేరు తీసుకురాగా, ప్రైవేటు ఆల్బమ్ ‘ఓర్శాడా..’, ‘పక్కం నీయుమ్ ఇైళ్లె..’ చార్ట్ బస్టర్లుగా నిలిచాయి. ధనుష్ ‘పటాస్’, ప్రభుదేవా ‘గులేబకావళి’, కార్తీ ‘సుల్తాన్’.. ఇలా కోలీవుడ్‌లో భారీ సినిమాలకు సంగీతం అందించారు ఈ సంగీత దర్శకద్వయం. తెలుగులో తమ తొలి సినిమా అయిన RAPO 22కు సంగీత ప్రియులు మెచ్చే ఆల్బమ్ ఇచ్చేందుకు ఈ మ్యూజిక్ డైరెక్టర్లు సమాయత్తమయ్యారని చిత్రబృందం చెబుతున్నది.