Ram Pothineni-boyapati Sreenu Movie | నాలుగేళ్ల క్రితం వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో రామ్ తనలోని మాస్ కోణాన్ని ప్రేక్షకులకు చూపించాడు. అంతకు ముందు ‘జగడం’, ‘ఒంగోలుగిత్త’ వంటి సినిమాల్లో మాస్ క్యారెక్టర్ చేసిన.. ఇస్మార్ శంకర్ స్థాయిలో లేవు. అంతేకాకుండా ఇస్మార్ట్ శంకర్ తర్వాత అంతేకాకుండా ఈ చిత్రం తర్వాత రామ్ కథల ఎంపిక పూర్తిగా మారింది. మాస్ ఆడియెన్స్‌కు దగ్గరవ్వాలనే ఉద్దేశంతో మాస్ కథల వైపే మొగ్గుచూపుతున్నాడు. గతేడాదిలో వచ్చిన ‘రెడ్’.. ఇటీవలే వచ్చిన ‘ది వారియర్’ చిత్రంలోనూ మాస్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించాడు.
ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాలు సాధించలేకపోయినప్పటికి.. రామ్‌కు మాత్రం మాస్లో మంచి పాపులారిటీ వచ్చింది. ఇక ఇప్పుడు ఏకంగా బోయపాటితో సినిమా చేస్తుండటంతో అందరిలోనూ ఎక్కడలేని ఆసక్తి నెలకొంది. దానికి తగ్గట్లు ఇటీవలే రిలీజైన గ్లింప్స్ వేరే లెవల్లో ఉంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ముందుగా ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రేక్షకులు ముందుకు తీసుకురానున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. అయితే తాజాగా ఈ సినిమా ప్రీ పోన్ కానున్నట్లు తెలుస్తుంది.
టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాను రెండు నెలలు ముందుగా అంటే ఆగస్టులో ఈ సినిమాను తీసుకొచ్చే విధంగా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ రిలీజ్ డేట్‌కు సంబంధించిన వార్త నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమలో రామ్‌కు జోడీగా శ్రీలీల నటిస్తుంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.