హీరో రామ్ పోతినేని కథానాయకుడిగా రూపొందుతున్న యాక్షన్ డ్రామా ‘ఆంధ్రా కింగ్ తాలూకా’. కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. మహేశ్‌బాబు.పి దర్శకత్వంలో మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం నవంబర్ 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రచారంలో వేగం పెంచారు. ఈ క్రమంలో గురువారం ఉపేంద్ర పుట్టినరోజును పురస్కరించుకొని ‘హ్యాపీ బర్త్ డే ఆంధ్రా కింగ్’ అంటూ ఓ స్పెషల్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు.
సూపర్‌స్టార్ అవతారంలో అభిమానులకు అభివాదం చేస్తూ ఈ పోస్టర్లో ఉపేంద్ర కనిపిస్తున్నారు. ఇందులో ఉపేంద్ర సినిమా హీరోగా నటిస్తుండగా.. ఆయన డై-హార్డ్ ఫ్యాన్‌గా రామ్ కనిపించనున్నారు. ఇది ఓ అభిమాని బయోపిక్ అని తెలుస్తున్నది. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో రావురమేశ్, మురళీశర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేశ్ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: సిద్ధార్థ్ నూని, సంగీతం: వివేక్ అండ్ మెర్విన్.