రామ్ పోతినేని కథానాయకుడిగా రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఆంధ్రాకింగ్ తాలూకా’. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. కన్నడ అగ్రనటుడు ఉపేంద్ర ఇందులో ఆన్ స్క్రీన్ సూపర్‌స్టార్‌గా కనిపించనున్నారు. మహేశ్‌బాబు పి. దర్శకుడు. మైత్రీమూవీమేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానున్నది.
శుక్రవారం ఈ సినిమా నుంచి మూడో పాటను మేకర్స్ విడుదల చేశారు. ‘రంగు రంగు తారలన్నీ తొంగి తొంగి ఒక్కసారి చూస్తున్నాయేంటిలా.. పైన లేని వెన్నెలంత నేలమీదకొచ్చినట్టు నువ్వుంటే చూడవా..’ అంటూ సాగే ఈ ప్రేమగీతాన్ని కృష్ణకాంత్ రాయగా, వివేక్ అండ్ మెర్విన్ స్వరపరిచారు.
మెర్విన్ సొలోమన్, సత్య యామినీ కలిసి ఆలపించారు. ఆద్యంతం లవ్‌ఫీల్‌తో సాగే ఈ పాటలో రామ్, భాగ్యశ్రీబోర్సేల కెమిస్ట్రీ అద్భుతంగా ఉంటుందని మేకర్స్ తెలిపారు. రావు రమేశ్, మురళీశర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేశ్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సిద్ధార్థ నుని, సమర్పణ: గుల్షన్‌కుమార్, భూషణ్‌కుమార్, టి.సిరీస్ ఫిల్మ్స్.