యువతలో ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్న కథానాయిక భాగ్యశ్రీ బోర్సే. రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ అందాలభామ రీసెంట్గా విజయ్ దేవరకొండతో ‘కింగ్డమ్’ మూవీలో మెరిశారు. ప్రస్తుతం రామ్ పోతినేని నటిస్తున్న ‘ఆంధ్రా కింగ్ తాలూకా’లో నటిస్తున్నారు. మహేశ్‌బాబు.పి దర్శకుడు. వచ్చే నెల 28న సినిమా విడుదల కానుంది.
ఇదిలావుంటే.. ఈ సినిమాకోసం హీరో రామ్ కవిగా మారారు. ఈ సినిమాలో ఆయన ఓ పాట స్వయంగా రాశారు. అనిరుధ్ ఆ పాటను స్వరపరిచారు. ఇప్పటికే ఆ పాట చార్ట్ బస్టర్‌గా నిలిచింది. యువతను కూడా ఆకట్టుకున్నది. విశేషమేంటంటే.. ఈ పాటను రీసెంట్గా భాగ్యశ్రీ బోర్సే స్వయంగా ఆలపించింది.
బ్యాగ్రౌండ్లో ఈ మెలోడీ ప్లే అవుతుంటే.. ఈ పాటలోని లిరిక్స్‌ని అందంగా ఆలపించారు భాగ్యశ్రీ బోర్సే. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్లో వైరల్ అవుతున్నది. రామ్, భాగ్యశ్రీ బోర్సే రిలేషన్లో ఉన్నట్టు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రామ్ రాసిన పాటను భాగ్యశ్రీ పాడటం హాట్‌టాపిక్‌గా మారింది.