Vijay Sethupathy – RGV | టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) సినిమాల గురించి పత్యేక పరిచయం అవసరం లేదు. ఆయన ఏం చేసినా వివాదమే. సినిమాల కోసం ఆయన ఎంచుకునే కథలు కూడా అలాగే ఉంటాయి. ఎవరు టచ్ చేయని పాయింట్స్ ను టచ్ చేస్తూ వైరల్ అవడం ఆయనకు అలవాటే. అయితే మరోసారి అలాంటి సినిమాతోనే ప్రేక్షకుల ముందుకు వర్మ రానున్నట్లు తెలుస్తుంది. రామ్ గోపాల్ వర్మ తాజాగా తమిళ అగ్ర నటుడు విజయ్ సేతుపతిని కలిశాడు. అయితే ఈ మీటింగ్ సినిమాకు సంబంధించి అని తెలుస్తుంది. విజయ్ సేతుపతితో రామ్ గోపాల్ వర్మ సినిమా తీయబోతున్నాడా అని సినీ ప్రియులు చర్చించుకుంటున్నారు.
ఇక ఈ సమవేశంపై ఆర్జీవీ ఎక్స్‌లో స్పందిస్తూ.. సినిమాల్లో అతడి నటనను చాలాసార్లు చూసిన తర్వాత చివరకు అతడిని కలుసుకున్నాను. అతడే మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి. ఇతడిని కలుసుకున్న అనంతరం విజయ్ సినిమాల్లో కంటే రియల్ లైఫ్‌లో ఇంకా బెటర్ అని తెలుసుకున్నాను అంటూ వర్మ రాసుకోచ్చాడు.
After seeing him many times on SCREEN, I finally met the REAL @VijaySethuOffl to realise that he is even BETTER in REAL than on SCREEN pic.twitter.com/NW3KOktnlr
— Ram Gopal Varma (@RGVzoomin) May 21, 2024