Ram Gopal Varma | నిత్యం ఏదో కామెంట్ చేస్తూ వార్తల్లో నిలిచే టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరోసారి వార్తల్లో నిలిచారు. నిన్నటి వరకు సినీ ఇండస్ట్రీలో నెలకొన్న సమస్యలపై మాట్లాడిన ఆర్జీవీ.. సంక్రాంతి పండుగ సందర్భంగా వరుస ట్వీట్లు చేశారు. అయితే పండుగలు, పబ్బాలు తనకు నచ్చవు అని చెప్పే ఆర్జీవీ.. కొత్తగా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ.. మొత్తం ఐదు ట్వీట్లు చేయగా అందులో కొన్ని ట్వీట్లు ఆసక్తికరంగా ఉన్నాయి.
అందరికీ హ్యపీ సంక్రాంతి. ఒక పెద్ద ఇల్లు, ముకేష్ అంబానీ కంటే అధిక డబ్బు సంపాదించేలా ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలి. ప్రస్తుతం కానీ, భవిష్యత్లో కానీ మీకు ఎలాంటి వైరస్ సోకొద్దని కోరుకుంటున్నాను. పురుషులందరూ ప్రపంచంలోనే అత్యంత అందమైన స్త్రీని పొందాలని, స్త్రీలు కూడా అత్యంత అందమైన వ్యక్తిని పొందాలని కోరుకుంటున్నట్లు ఆర్జీవీ తన మొదటి ట్వీట్లో పేర్కొన్నారు. భార్యలు ఎవ్వరూ కూడా భర్తలను వేధించకూడదు. భర్తలు ఏం చేసినా, చేయకున్నా భార్యలు మీతో బాగుండాలని రామ్ గోపాల్ వర్మ అన్నారు.
ఏపీలో టికెట్ల ధరల వ్యవహారంపై కూడా ఆర్జీవీ స్పందించారు. టికెట్ల ధర పెంపునకు ఏపీ ప్రభుత్వం అంగీకరించాలని, ఫ్లాప్ సినిమాలకు ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అని ఆయన ట్వీట్ చేశారు. చిన్న సినిమాలు బాహుబలిని మించి హిట్ కావాలని కోరుకుంటున్నాను. నేను త్వరగా చనిపోవాలని నన్ను ద్వేషించేవాళ్లు కోరుకుంటారు. నన్ను ద్వేషించే వారి కోరిక నెరవేరాలని కోరుకుంటున్నానని ఆర్జీవీ తన చివరి ట్వీట్లో పేర్కొన్నారు.
Happy Sankranthri to all and may god bless each and everyone of u with a bigger house and more money than Mukesh Ambani and may no virus present or future infect u and may all men get the most beautiful woman in world and all women get most handsome man🙏💐
— Ram Gopal Varma (@RGVzoomin) January 14, 2022
Happy Sankranthri to all my haters and may god grant ur wish that I will die asap 😎😎😎💐💐💐
— Ram Gopal Varma (@RGVzoomin) January 14, 2022