Artificial intelligence | ఈ మధ్య ఎక్కడ చూసిన వాడుతున్న టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ). అయితే ఈ టెక్నాలజీని ఉపయోగించి ఒక వీడియో క్రియేటర్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో దివంగత నటి శ్రీదేవి డేటింగ్ వెళ్లినట్లు వీడియో క్రియేట్ చేశాడు. కాగా ఇందుకు సంబంధించిన వీడియోను మీరు చూసేయండి.
అగ్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి శ్రీదేవి అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తనకి శ్రీదేవి అంటే చాలా ఇష్టమని తనకి పెళ్లి అవ్వకుంటే శ్రీదేవినే చేసుకునేవాడినని చాలాసార్లు చెప్పాడు. అయితే తాజాగా రామ్ గోపాల్ వర్మ ప్రేమని ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రియేటర్ తన ఏఐ వీడియోతో ముందుకు తీసుకువచ్చాడు.
ఇందులో హాలీవుడ్లో బ్లాక్ బస్టర్ అందుకున్న ది సబ్‌స్టాన్స్() సినిమాలోని సన్నివేశాన్ని వాడుతూ.. మీరు ఎప్పుడైన బెటర్ వెర్షన్‌గా ఉండాలని కోరుకున్నారా. మరింద అందంగా. మరింత బ్యూటీఫుల్‌గా ఉండాలని కోరుకున్నారా అంటూ డెమి మూర్ వెర్షన్లో శ్రీదేవిని ఉంచి.. ఆర్జీవీ మాట్లాడుతున్నట్లుగా వీడియోని క్రియేట్ చేశారు. ఇక ఈ వీడియోలో శ్రీదేవి యంగర్ (సబ్‌స్టాన్స్ తీసుకున్న అనంతరం) వెర్షన్లో పెద్ద కూతురు జాన్వీ కపూర్‌ని జోడించారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
A I is becoming TOO MUCH 😳😳😳 pic.twitter.com/p8nsog9wmr
— Ram Gopal Varma (@RGVzoomin) January 12, 2025