Saaree Trailer | అగ్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో వస్తున్న తాజా చిత్రం ‘శారీ. యథార్థ సంఘటనల ఆధారంగా వస్తున్న ఈ చిత్రంలో ఆరాధ్య దేవి కథానాయికగా నటిస్తుంది. వర్మ ఈ సినిమాకు కథను అందించగా.. గిరి కృష్ణకమల్ దర్శకత్వం వహించాడు. ఆర్వీప్రొడక్షన్స్ పతాకంపై రవి వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు మేకర్స్. ఈ సందర్భంగా ట్రైలర్‌ని విడుదల చేశారు.
ఈ ట్రైలర్ చూస్తుంటే.. చీరలో ఉన్న అమ్మాయిని చూసి, ఆమెతో ప్రేమలో పడిన తర్వాత ఓ అబ్బాయి జీవితం ఎలా మారింది అనేది స్టోరీ తెలుస్తుంది. సైకలాజికల్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ ట్రైలర్‌ను మీరు చూసేయండి.