ప్రాణమే ఆవిరైపోయింది

శివకందుకూరి, మేఘాఆకాష్, ప్రియా వడ్లమాని హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘మను చరిత్ర’. భరత్ పెదగాని దర్శకుడు. కాజల్ అగర్వాల్ సమర్పణలో ఎన్.శ్రీనివాసరెడ్డి, రాన్సన్ జోసెఫ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘హఠాత్తుగా గుండె పిండినట్లుందే..హఠాత్తుగా నా ప్రాణమే ఆవిరైపోయిందే’ అనే గీతాన్ని శుక్రవారం దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ విడుదలచేశారు. సిరాశ్రీ సాహిత్యాన్ని అందించిన ఈ పాటను రేవంత్ ఆలపించారు. గోపీసుందర్ స్వరకర్త. నిర్మాతలు మాట్లాడుతూ ‘వరంగల్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. ప్రేమలో ఓడిపోయిన ఓ యువకుడి కథ ఇది. అతడి జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందన్నది ఆకట్టుకుంటుంది’ అని తెలిపారు. ప్రగతి, సుహాస్, డాలీ ధనుంజయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: రాహుల్ శ్రీ వాత్సవ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

