Upasana Konidela | టాలీవుడ్ స్టార్ నటుడు రామ్చరణ్ త్వరలో తండ్రి కాబోతున్న విషయం తెలిసిందే. ఆయన భార్య ఉపాసన త్వరలో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి ఇటీవల సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. పెళ్లైన పదేండ్లకి చరణ్, ఉప్సీ దంపతులు తొలి బిడ్డను ఆహ్వానిస్తుండటంతో ఆ కుటుంబంలో సందడి వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రెగ్నెన్సీ ప్రకటించిన తర్వాత ఉపాసన మొదటి సారి తన పుట్టింటికి వెళ్లింది.
అక్కడ తన పుట్టింటి వాళ్లతో సమయాన్ని సరదాగా గడుపుతోంది. ఈ సందర్భంగా ఉపాసన తన అమ్మ, అమ్మమ్మ ఇతర కుటుంబ సభ్యుల ఆశీర్వాదం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఉపాసన సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఇదే సమయంలో తన అత్త (చిరంజీవి భార్య సురేఖ)ను మిస్సవుతున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
2012లో రామ్చరణ్ ఉపాసన ప్రేమించి పెండ్లి చేసుకున్నారు. సంతానం కోసం ఎదురుచూస్తున్న వీరి కల పదేండ్లకు ఫలించింది. ఈ శుభ సందర్భంలో చరణ్, ఉపాసన దంపుతలకు సోషల్ మీడియా ద్వారా అభిమానులు, సెలబ్రిటీలు శుభాకాంక్షలు చెబుతున్నారు.