రామ్‌చరణ్ నటిస్తున్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నది. బుచ్చిబాబు సానా దర్శకుడు. ఇందులో రామ్‌చరణ్ వివిధ ఆటల్లో సిద్ధహస్తుడైన ఆటకూలీగా విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. రామ్‌చరణ్ పుట్టినరోజుని పురస్కరించుకొని వచ్చే ఏడాది మార్చి 27న పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్గ్లింప్స్కు అద్భుతమైన స్పందన లభించడంతో సినిమా అప్డేట్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
నేటి నుంచి పూణేలో ఓ పాటను తెరకెక్కించబోతున్నారు. రామ్‌చరణ్, జాన్వీకపూర్‌లపై చిత్రీకరించే ఈ పాట కోసం అగ్ర సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహమాన్ అద్భుతమైన ట్యూన్ సిద్ధం చేశారని, జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారని, విజువల్ ట్రీట్‌లా ఈ పాట నిలిచిపోతుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి నిర్మాణం: వృద్ధి సినిమాస్, సమర్పణ: మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, రచన-దర్శకత్వం: బుచ్చిబాబు సానా.