‘పెద్ది’ విడుదల ఆ రోజేనా?
అగ్ర కథానాయకుడు రామ్‌చరణ్ ‘పెద్ది’ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్నది. నాలుగు రోజుల పాటు జరిగే ఐటమ్ సాంగ్ చిత్రీకరణతో షూటింగ్ కంప్లీట్ అవుతుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.
అగ్ర కథానాయకుడు రామ్‌చరణ్ ‘పెద్ది’ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్నది. నాలుగు రోజుల పాటు జరిగే ఐటమ్ సాంగ్ చిత్రీకరణతో షూటింగ్ కంప్లీట్ అవుతుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాను ముందు ఈ ఏడాది మార్చి 27న విడుదల చేయాలనుకున్నారు. కానీ కుదరలేదు. ఆ తర్వాత ఏప్రిల్ 30న విడుదల అన్నారు. అది కూడా సాధ్యపడలేదు. తాజాగా జూన్‌లో ‘పెద్ది’ని విడుదల చేయనున్నట్టు నిర్మాత వెంకటసతీశ్ కిలారు ప్రకటించారు.
కానీ డేట్‌ని మాత్రం ఖాయం చేయలేదు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జూన్ 25న ‘పెద్ది’ని విడుదల చేయాలని మేకర్స్ నిశ్చయించారట. ఈ తేదీ అన్ని విధాలుగా సినిమాకు కలిసొస్తుందని, ఇంకా రెండు నెలలు సమయం ఉండటం వల్ల పోస్ట్ ప్రొడక్షన్‌కి కావాల్సినంత సమయం దొరుకుతుందని, పానిండియా సినిమా కావడంతో దేశవ్యాప్తంగా పబ్లిసిటీని నిర్వహించేందుకు కూడా అవకాశం ఉంటుందని మేకర్స్ భావిస్తున్నారు.
అందుకే ‘పెద్ది’ విడుదల తేదీగా త్వరలోనే ‘జూన్ 25’ను అధికారంగా ప్రకటించనున్నారట. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందుశర్మ కీలక పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: ఆర్.రత్నవేలు, సంగీతం: ఏ.ఆర్.రెహమాన్, సమర్పణ: మైత్రీమూవీమేకర్స్, సుకుమార్ రైటింగ్స్, నిర్మాణం: వృద్ధి సినిమాస్, దర్శకత్వం: బుచ్చిబాబు సానా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RRR | రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి కేంద్రం బ్రేక్.. ప్రస్తుత అలైన్మెంట్తో ప్రాజెక్టుకు ఆమోదం కష్టమే!
Congenital Birth: ఒడిశాలో రెండు తలలతో పుట్టిన మగ శిశువు
Mithun Chakraborty | ‘జైలర్ 2’లో రజనీకాంత్‌కు మిథున్ చక్రవర్తి కండీషన్.. విలన్ పాత్రకు ఓకే చెప్పడానికి అదే కారణమా?
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్‌కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
Pope Leo XIV: పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీతో కణితి తొలగింపు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

