Mega Heroes | మెగా కుటుంబం మరోసారి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలు, పాటలు, అప్డేట్స్తో అభిమానుల ఆనందం పీక్స్‌కి చేరుకుంది . అయితే ఈసారి తండ్రి–కొడుకుల మధ్య యూట్యూబ్ రికార్డుల రేసు చర్చనీయాంశంగా మారింది. చిరంజీవి తాజా చిత్రం మనశంకర వరప్రసాద్ గారు చిత్రం నుంచి ఇటీవల విడుదలైన ‘మీసాల పిల్ల’ పాట సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టించింది. భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన ఈ ఎనర్జిటిక్ మెలోడీ కేవలం కొన్ని రోజుల్లోనే యూట్యూబ్‌లో 50 మిలియన్ వ్యూస్ సాధించి చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సాంగ్‌పై అభిమానులు చేసిన రీల్స్, షార్ట్ వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.
అయితే ఇప్పుడు ఆ రికార్డును కొడుకు రామ్ చరణ్ బీట్ చేయడం విశేషం. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రూపొందుతున్న ‘పెద్ది’ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘చికిరి చికిరి’ అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ఈ పాట కేవలం రెండు రోజుల్లోనే 50 మిలియన్ వ్యూస్ దాటింది. 35 గంటల్లోనే ఈ ఘనత సాధించడం విశేషం.తెలుగు మాత్రమే కాకుండా నాలుగు భాషల్లో విడుదలైన ఈ వీడియో సాంగ్ యూట్యూబ్ ట్రెండింగ్ లిస్టుల్లో టాప్ ప్లేస్‌ను దక్కించుకుంది. మరోవైపు చిరంజీవి పాట మాత్రం తెలుగులో మాత్రమే లిరికల్ వీడియోగా విడుదలై, మూడు వారాల్లో 50 మిలియన్ వ్యూస్ సాధించింది.
తండ్రి–కొడుకులిద్దరూ ఒక్కొక్కరుగా సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేస్తుండటంతో, అభిమానులు “మెగా మ్యూజిక్ ఫెస్టివల్ కొనసాగుతోంది” అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఒకరిపై ఒకరు సెట్ చేస్తున్న ఈ రికార్డులు ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారాయి.ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్‌ని షేక్ చేయడం ఖాయం అంటున్నారు.