అగ్ర హీరో రామ్‌చరణ్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘పెద్ది’. ‘ఉప్పెన’ఫేం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నది. ఉగాది పండుగ పురస్కరించుకుని ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన అప్డేట్ని మేకర్స్ ఆదివారం విడుదల చేశారు. ఈ చిత్రం తొలి షాట్‌ని ఏప్రిల్ 6న శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా విడుదల చేయనున్నట్టు వారు ప్రకటన ద్వారా తెలియజేశారు.
రామ్‌చరణ్ జనసమూహం మధ్య గాలిలోకి దూకుతూ కనిపిస్తున్న అనౌన్స్మెంట్ పోస్టర్ అభిమానుల్ని రోమాంచితం చేస్తుందని, ఈ ఫస్ట్ షాట్ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తుందని మేకర్స్ చెబుతున్నారు. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈచిత్రంలో కన్నడ అగ్రహీరో శివరాజ్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. జగపతిబాబు, దివ్యేందుశర్మ కీలక పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: ఆర్.రత్నవేలు, సంగీతం: ఏ.ఆర్.రెహ్మాన్, సమర్పణ: మైత్రీ మూవీమేకర్స్, సుకుమార్ రైటింగ్స్, నిర్మాణం: వృద్ధి సినిమాస్.