సంక్రాంతి బరిలో దిగిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నారు దర్శకుడు బాబీ (కె.యస్.రవీంద్ర). అదే ఉత్సాహంతో ఆయన తదుపరి సినిమాల కోసం సన్నద్ధమవుతున్నారు. ఇటీవల సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో సినిమా చేసే అద్భుతమైన అవకాశాన్ని దక్కించుకున్నట్లు తెలిసింది. ఈ సినిమాకు దిల్‌రాజు నిర్మాణ సారథ్యం వహించనున్నట్లు సమాచారం. ఇదిలావుండగా బాబీ తెలుగులో మరో లక్కీ ఛాన్స్ దక్కించుకున్నారని చెబుతున్నారు.
రామ్‌చరణ్ హీరోగా ఓ చిత్రం ఖరారైందని సమాచారం. పాన్ ఇండియాకు రీచ్ అయ్యేలా బాబీ చెప్పిన కథ రామ్‌చరణ్‌కు బాగా నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రామ్‌చరణ్ ‘గేమ్ చేంజర్’ చిత్రంలో నటిస్తున్నారు. దీని అనంతరం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో చరణ్ చేయబోతున్న చిత్రం సెప్టెంబర్‌లో ప్రారంభంకానుంది. ఈ రెండు సినిమాలు పూర్తయ్యాకే వచ్చే ఏడాది ద్వితీయార్థంలో బాబీ చిత్రం సెట్స్‌మీదకు వెళ్లే అవకాశం ఉందని సమాచారం.